Wednesday, October 7, 2020

Primary education should be in the mother tongue



Read also:

The Supreme Court has said that primary education should be in the mother tongue


ఆంగ్లమాధ్యమం అంశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చింది. ఒక సబ్జెక్టుగా తెలుగును కూడా ఉంచాం. 96% మంది తల్లిదండ్రులు ఆంగ్లం కోరుకుంటున్నారు. తెలుగు కావాలనుకునరే వారికోసం మండల కేంద్రంలో స్కూలు ఉంటుంది. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం .అని ప్రభుత్వ తరఫు సీనియర్‌ న్యాయవాది విశ్వనాథన్‌‌ వాదనలు వినిపించారు. దీనికి బదులుగా జస్టిస్‌ బోబ్డే ధర్మాసనం మాట్లాడుతూ  గణాంకాల ఆధారంగా నిర్ణయం తీసుకోలేం. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం ముఖ్యం.చిన్నారులకు పునాది బాల్యం.. ఆస్థాయిలో మాతృభాషలోనే విద్యను అందించాలి అని విచారణను సుప్రీం వచ్చే వారానికి వాయిదా వేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :