Sunday, October 11, 2020

PRC info



Read also:

పీ ఆర్ సీ అమలుకు మరింత ఆలస్యం తప్పదా

అధ్యయనానికి మరో హైపవర్ కమిటీ ఏర్పాటు

ముగ్గురు ఉన్నతాధికారులతో

కదిలిన ఫైలు, త్వరలో జీవో విడుదల


ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న 11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలుకు మరింత  ఆలస్యం  తప్పేలా లేదు. అశుతోష్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన  ఏకసభ్య కమిషన్  తన నివేదికను అందించి వారం రోజులయింది. రాష్ర్ట  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  ఈ నివేదిక చేరింది.  ఇప్పుడు వేతన సవరణ నివేదికపై ప్రభుత్వం మరో హైపవర్ కమిటీ  ఏర్పాటు చేయబోతోంది.  ప్రస్తుత సమాచారాన్ని బట్టి  ముగ్గురు ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉంటారని తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే  సిద్ధమై ప్రభుత్వానికి చేరింది. వారు వేతన సవరణ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి నివేదికను ఎలా అమలు చేయాలి, ఇందుకు ప్రభుత్వం పై ఎంత భారం పడుతుంది? అందులోని ఇతర అంశాలపై  ప్రభుత్వ వైఖరి ఎలా   ఉండాలి తదితర అంశాలు అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు వీలుగా  ఈ కమిటీ ఏర్పాటవుతోంది. ఇందులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సర్వీసుల విభాగం కార్యదర్శి,  మరో ఉన్నతాధికారి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం ఉద్యోగులు న్యూస్ కు అందింది.   ఈ నివేదిక ఇచ్చేందుకు గడువు మూడు నెలలు విధిస్తారా అంతకన్నా  ఎక్కువ ఉంటుందా అన్నది ఇంకా తేలలేదని , ప్రభుత్వ స్థాయిలోనే గడువు నిర్ణయిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు  ఈ  వారంలోనే రాబోతున్నాయి. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :