Tuesday, October 13, 2020

PM kisan scheme



Read also:

కేంద్రం తీపికబురు.రైతుల ఖాతాల్లో మళ్లీ రూ.2000

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. వారికీ అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంకగా అందిస్తున్న స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి అందరికి తెలిసిందే. ఇక రైతులకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగానే డబ్బులు వచ్చి చేరతాయని అధికారులు తెలిపారు.


అంతేకాక ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి రూ.6,000 వస్తాయన్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. అంటే ఒక్కో ఇన్‌స్టాల్‌ మెంట్‌కు రూ.2,000 వస్తాయని తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.12,000 జమచేసిందని వెల్లడించారు.

ఇక ఇప్పుడు మరో విడత డబ్బులు రైతుల అకౌంట్లలోకి రానున్నాయని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటికే రెండు విడతల్లో డబ్బులు రైతులకు చేరాయని తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడో విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనుందని పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో రైతులకు మళ్లీ రూ.2,000 వచ్చి చేరనున్నాయని తెలిపారు.

అయితే మీరు ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరి ఉంటే మీకు సులభంగానే డబ్బులు వస్తాయని తెలిపారు. ఒకవేళ ఇంకా మీరు ఈ స్కీమ్‌లో చేరకపోతే వెంటనే చేరండి. ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సులభంగానే స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చునన్నారు. https://pmkisan.gov.in/ ఈ లింక్ సాయంతో మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చునన్నారు. ఇక ఆధార్ నెంబర్, పొలం పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ వద్దనే ఉంచుకోండి అని తెలిపారు.

Check PM Kisan Status Here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :