Saturday, October 31, 2020

pan card mistakes



Read also:

పాన్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా ఇంట్లో నుంచే సరిచేసుకోవచ్చు

పాన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు మాదిరిగానే ఇది కూడా కీలకమైన డాక్యుమెంట్. ఐడీ కార్డుగా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్ దాఖలు చేయడానికి, బ్యాంకులో అధిక విలువ కలిగిన లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డు అవసరం అవుతుంది. 

అంతేకాకుండా జీఎస్‌టీ వంటి వాటికి కూడా ఇది ఉండాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్నా పాన్ కార్డు అడుగుతారు. అందుకే పాన్ కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌ అని చెప్పుకోవచ్చు. అయితే పాన్ కార్డులో వివరాలు కొంత మందికి తప్పుగా ఉండొచ్చు. పాన్ కార్డు వివరాలు తప్పుగా ఉంటే వారికి సరిచేసుకోవచ్చు. ఈ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు

అయితే పాన్ కార్డులో వివరాలు సరి చేసుకోవడం ఎలా? అనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో కూర్చొని పాన్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు.

దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. దీని కోసం మీరు ముందుగా ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇందులో సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పాన్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి.

ఇప్పుడు పాన్ డేటా వివరాల మార్పు లేదా పాన్ కార్డ్ రిప్రింట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఫిల్ చేయాలి. ఇంకా ఈకేవైసీ పూర్తి చేయాలి. తర్వాత డబ్బులు కట్టాలి. ఇక చివరిలో అన్ని డాక్యుమెంట్లను ఎన్ఎస్‌డీఎల్ ఇగవ్ ఆఫీస్కు పంపించాల్సి ఉంటుంది. తర్వాత మీ వివరాలు అప్‌డేట్ అవుతాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :