Wednesday, October 14, 2020

No need KYC for payment transactions in Paytm



Read also:

No need KYC for payment transactions in Paytm

డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ పేటీఎం తమ యూజర్లకు కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ నూతన అప్ డేట్ తో పేటీఎం యాప్ ను ఉపయోగించి కేవైసీ కాని యూజర్లకు సైతం మీ బ్యాంకు ఖాతా నుండి నేరుగా మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ పేటీఎం తమ యూజర్లకు కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ నూతన అప్ డేట్ తో పేటీఎం యాప్ ను ఉపయోగించి కేవైసీ కాని యూజర్లకు సైతం మీ బ్యాంకు ఖాతా నుండి నేరుగా మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. అవతలి వ్యక్తి మొబైల్ నంబర్, యుపిఐ ఐడి లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి ఎటువంటి ఛార్జీలు లేకుండానే నేరుగా మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. దీనికి సంబంధిన ప్రచార చిత్రాన్ని పేటీఎం విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్ ను భారతీయ వివాహంలో జరిగే ఒక చక్కని సన్నివేశంతో రూపొందించింది. వీడియోలో ఉన్న దాని ప్రకారం వధువు సోదరి, వరుడి బూట్లను తిరిగి ఇచ్చే ముందు అతని నుండి డబ్బు కోరుతుంది. దీంతో వరుడు పేటీఎం యాప్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తానని చెబుతాడు. కాని ఆమె తన వాలెట్ కేవైసీ పూర్తి కాలేదని తెలియజేస్తుంది. దీంతో వరుడి సోదరుడు అడ్డుకుని ఆ అమ్మాయి మొబైల్ నంబర్ అడుగుతాడు. తరువాతి సన్నివేశంలో, కేవైసీ అవసరం లేకుండానే నేరుగా బ్యాంకు ఖాతా నుండి మరే ఇతర బ్యాంకు ఖాతాకైనా డబ్బును బదిలీ చేయవచ్చని వరుడికి తన సోదరుడు తెలియజేస్తాడు. దీంతో ఆ అమ్మాయి బ్యాంక్ ఖాతాకు వరుడు క్షణాల్లో మనీ ట్రాన్స్ ఫర్ చేస్తాడు. అంతేకాక తను చేసిన ట్రాన్సాక్షన్ కు గాను క్యాష్ బ్యాక్ ను స్వీకరిస్తాడు. దీంతో వీడియో ముగుస్తుంది.
ఈ క్యాంపెయిన్ లో భాగంగా పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అభినవ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘పేటీఎం యాప్ ను ఉపయోగించి నిమిషాల్లో బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ ఫర్స్ ఎలా చేయవచ్చనే దానిపై వినియోగదారులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇకపై ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటే కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు.

దీనికి సంబంధించి యూజర్ల అవగాహన కొరకు విడుదల చేసిన వీడియోకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో మంచి ఆదరణ లభించింది.” అని పేర్కొన్నారు. కాగా, కొన్ని రోజుల ముందు పేటీఎం తన ‘ఫోన్ పార్ కౌన్ థా?’ వీడియోను విడుదల చేసింది, ఇందులో నటుడు రూపాల్ పటేల్ కోకిలాబెన్ పాత్రలో నటించారు.
తమ యూజర్లు ఫ్రాడ్ కాల్స్ లేదా ఫేక్ ఎస్ఎంఎస్ ల నుంచి, ఫిషింగ్ మోసాల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై పేటీఎం ఈ వీడియోను రూపొందించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :