Saturday, October 31, 2020

mobile data saftey tips



Read also:

ఫోన్ పోయిన వారి బాధ వర్ణణాతీతం. ఆ మొబైల్ దొరికిన వారు అందులో ఉన్న డేటాతో మనకు ఏదైనా నష్టం చేస్తారేమోన్న టెన్షన్ వారిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ ఫోన్‌ పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన సందర్భాల్లో మీరు దాన్ని ఇలా ట్రాక్ చేయొచ్చు.

నేడు మానవజీవనంలో సెల్ ఫోన్ భాగమైంది. ఎక్కడికి పోయిన సెల్ ఫోన్ పక్కన లేకుంటే ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్న వారి నుంచి పెద్దల వరకు కాసేపు సెల్ ఫోన్ ముట్టుకుకోక పోతే ఏమీ తోచని స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మన జీవన శైలిలో మొబైల్ ఫోన్ అంతర్భాగమైపోయింది. అలాంటి ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకుంటే.. ఆ బాధితులు పడే బాధ వర్ణణాతీతం. ఎందుకంటే మొబైల్ ను పోగొట్టుకుంటే కేవలం వస్తువును మాత్రమే కోల్పోవడం కాదు.. చాలా డేటాను మనం నష్టపోతాం. ఈ రోజుల్లో సెల్ ఫోన్ లో మనం అనేక సమాచారాన్ని దాచుకుంటాం. సర్టిఫికేట్ల ఫొటో కాపీలు, వందలాది ఫోన్ నంబర్లు, చిరునామాలు, అనేక ఐడీ, పాస్ వర్డ్ లు, వ్యక్తిగత, ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు ఫోన్ లోనే ఉంటాయి. దీంతో ఫోన్ పోయిన వారి బాధ వర్ణణాతీతం. ఆ మొబైల్ దొరికిన వారు అందులో ఉన్న డేటాతో మనకు ఏదైనా నష్టం చేస్తారేమోన్న టెన్షన్ వారిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ ఫోన్‌ పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన సందర్భాల్లో మీరు దాన్ని ఇలా ట్రాక్ చేయొచ్చు. తద్వారా మీ ఫోన్ ను కనిపెట్టలేకపోయినా కనీసం దానిలోని మీ వ్యక్తిగత డేటానైనా చెరిపివేయవచ్చు.

ఆ యాప్ తో మీ డేటా సేఫ్

మీ ఫోన్ దొంగలించబడన సందర్భంలో ఇతర ఆండ్రాయిడ్ డివైజ్లో గూగుల్ ప్లే స్టోర్ ను ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేయండి. దొంగిలించబడిన మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి, మీ ఫోన్‌లోని మొత్తం డేటాను లాక్ చేయడానికి లేదా తొలగించడానికి ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ యాప్ మీకు అవకాశం కల్పిస్తుంది. తద్వారా మీ పర్సనల్ డేటా సురక్షితంగా ఉంటుంది.

డేటాను లాక్ చేసేందుకు స్టెప్స్

  • Android.com/find లోకి వెళ్లి మీ గూగుల్ ఖాతాకు సైన్ ఇన్ అవ్వండి.
  • ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లు ఉంటే, స్క్రీన్ పైభాగంలో చూపించే కోల్పోయిన ఫోన్ సెలెక్ట్ చేసుకోండి.
  • మీ కోల్పోయిన ఫోన్‌లో ఒకటి కంటే ఎక్కువ గూగుల్ ప్రొఫైల్స్ ఉంటే, ప్రధాన ప్రొఫైల్‌లో ఉన్న గూగుల్ అకౌంట్ తోనే సైన్ ఇన్ అవ్వండి.
  • ఆ తర్వాత మీరు కోల్పోయిన ఫోన్‌కు ఒక నోటిఫికేషన్ వస్తుంది.
  • తద్వారా గూగుల్ మ్యాప్‌లో, మీ ఫోన్ ఎక్కడ ఉందన్న సమాచారం తెలుసుకోవచ్చు.
  • అయితే, మీ ఫోన్ ఉన్న ప్రస్తుత ప్రదేశాన్ని సుమారుగానే చూపిస్తుంది. ఖచ్చితమైన ప్రదేశాన్ని చూపించకపోవచ్చు.
  • అప్పటికీ మీ ఫోన్‌ ప్రస్తుతం ఉన్న ప్రదేశాన్ని కనుగొనలేకపోతే, మీరు చివరగా ఫోన్ పోగొట్టుకున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత మీ ఫోన్ లాక్ చేయండి లేదా డేటాను తొలగించండి అనే ఆప్షన్లు అక్కడ ప్రత్యక్షమవుతాయి. వాటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోండి.
అంతేకాక, మీ ఫోన్లోని డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి పిన్, పాటర్న్ లేదా పాస్‌వర్డ్‌తో మీ ఫోన్‌ను లాక్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌ దొరికిన వ్యక్తి మీకు దాన్ని తిరిగి ఇవ్వడానికి లాక్ స్క్రీన్‌పై మీ ఫోన్ సందేశం లేదా ఫోన్ నంబర్‌ను యాడ్ చేయండి. మీ ఫోన్‌లోని మొత్తం డేటాను శాశ్వతంగా తొలగించండి అయితే, దీని ద్వారా మీ SD కార్డ్‌లోని డేటా తొలగించ లేకపోవచ్చు. కాగా, మీ ఫోన్‌లోని డేటా తొలగించిన తర్వాత ఒకవేళ మీరు మీ ఫోన్ ను కనుగొంటే, ఆ డేటాను రికవరీ చేయడానికి మళ్ళీ మీ గూగుల్ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :