Thursday, October 15, 2020

LIC Notification @550 posts



Read also:

ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఇటీవల 550 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 550 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 250 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు కాగా, 300 టెక్నీషియన్ లేదా డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు.

2. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చెరీ, లక్షద్వీప్‌కు చెందిన గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇంజనీర్ల నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 15న ప్రారంభమవుతుంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 3 చివరి తేదీ.

3. అభ్యర్థులు నవంబర్ 3 లోగా మొదట నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ https://www.mhrdnats.gov.in/ లో దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత నవంబర్ 10 లోగా ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.com/ లో అప్లై చేయాలి.

4. మొత్తం 550 ఖాళీలు ఉండగా అందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 250 ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 70, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 10, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 10, సివిల్ ఇంజనీరింగ్- 35, మెకానికల్ ఇంజనీరింగ్- 75, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 20, కెమికల్ ఇంజనీరింగ్- 10, మైనింగ్ ఇంజనీరింగ్- 20 ఖాళీలున్నాయి.

5. టెక్నీషియన్ లేదా డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు 300 ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 85, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 10, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 10, సివిల్ ఇంజనీరింగ్- 35, మెకానికల్ ఇంజనీరింగ్- 90, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 25, మైనింగ్ ఇంజనీరింగ్- 30, ఫార్మాసిస్ట్- 15 ఖాళీలున్నాయి.

6. విద్యార్హత వివరాలు చూస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో గ్రాడ్యుయేషన్, టెక్నీషియన్ లేదా డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

7. ఇతర అర్హతలు చూస్తే 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో పాసైనవారు మాత్రమే అప్లై చేయాలి. ఇప్పటికే దరఖాస్తు చేసినవాళ్లు, అప్రెంటీస్ చేస్తున్నవారు అప్లై చేయకూడదు. స్టైపెండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.15,028, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు రూ.12,524 లభిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :