Tuesday, October 6, 2020

Jagan's meeting with Prime Minister Modi discussed points



Read also:

AP CM Jagan Delhi Tour:ఢిల్లీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ముఖ్యంగా. ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ ఏం చర్చించారనే అంశంపై లోతుగా విశ్లేషణలు జరుగుతున్నాయి.

AP CM Jagan Delhi Tour: కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరుతుందనే ఊహాగానాల మధ్య. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ మీటింగ్ 40 నిమిషాల పాటూ సాగింది. ప్రధానంగా ఈ భేటీ. రాష్ట్ర అభివృద్ధి అంశాలే అజెండాగా సాగినట్లు తెలిసింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయం, జీఎస్టీ చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, దిశ సహా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న ఏపీ బిల్లులు వంటి 17 అంశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లినట్లు తెలిసింది. అన్ని అంశాలకూ ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ మీటింగ్ తర్వాత. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర జల శక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి వాదనలు బలంగా వినిపించేందుకు. సీఎం జగన్‌ వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్‌ మార్గాని భరత్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ఉన్నారు.

వైసీపీ కేంద్ర కేబినెట్‌లో చేరుతుందా?

ప్రధానితో సీఎం జగన్ భేటీ చాలా త్వరగా ముగియడం వల్ల. ప్రస్తుతానికి ఇలాంటి రాజకీయ అంశాలపై చర్చ జరగలేదని తెలిసింది. ఢిల్లీ వర్గాల ఊహాగానాలకు తగ్గట్టుగా. NDAలో చేరే అంశంపై చర్చ జరగలేదని తెలిసింది. ఆల్రెడీ బీజేపీకి వైసీపీ బయటి నుంచి మద్దతు ఇస్తుండటం, ఇప్టటికిప్పుడు బీజేపీకి వైసీపీ మద్దతు అంతగా అవసరం లేకపోవడంతో. ఈ అంశం చర్చకు రాలేదని తెలిసింది.

అన్నీ ఊహాగానాలేనా?

సీఎం జగన్. రెండు వారాల గ్యాప్‌లో రెండోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకోవడంతో. రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. ప్రధానంగా. వైసీపీని బీజేపీ. NDA కూటమిలోకి ఆహ్వానిస్తోందనే టాక్ ఢిల్లీ వర్గాల నుంచి వినిపించింది. దీనికి ప్రధాన కారణం. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని మొదటి నుంచి వైసీపీ సమర్థిస్తోంది. ఈమధ్య తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు కూడా వైసీపీ మద్దతిచ్చింది. దాంతో. సహజంగానే బీజేపీకి వైసీపీ దగ్గరవుతోందనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో. NDAలో బీజేపీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు కొన్ని కమలదళానికి గుడ్ బై చెబుతున్నాయి. అందువల్ల కేంద్ర కేబినెట్‌లో చేరమని వైసీపీని బీజేపీ ఆహ్వానించే ఛాన్సుందనే ప్రచారం జరిగింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :