Thursday, October 8, 2020

Jagananna vidyakanuka



Read also:

అమ్మ ఒడి కార్యక్రమం అమలు సందర్భంలో నమోదైన వివరాల ఆధారంగా వీటిని పంపిణీ చేస్తారు.


  • విద్యాకానుక కిట్‌లో మొత్తం 7 రకాల వస్తువులుంటాయి. సంచి, బూట్లు, సాక్సు, బెల్ట్‌, ఏకరూప దుస్తులు, రాత, పాఠ్య పుస్తకాలలో ఏమైనా సక్రమంగా లేకపోతే సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఎంఈవోను సంప్రదించాలి.
  • ప్రాథమిక పాఠశాలల్లో అయిదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అదే పాఠశాలలో కిట్లను తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
  • 2019-20లో నమోదైన ప్రవేశాల ఆధారంగా పాఠశాలల్లో కిట్లను సిద్ధం చేశారు. ఒకటి రెండు చోట్ల కిట్లు అందకపోయినా మలి విడతలో అందజేస్తారు
  • విద్యాకానుకల సామగ్రిని అందించే సందర్భంలో విద్యార్థుల తల్లుల ఐరిస్‌ లేదా బయోమెట్రిక్‌ నమోదు తప్పనిసరి. వీలైనంత వరకు ఐరిస్‌ నమోదుకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను శానిటేషన్‌ చేశారు. లబ్ధిదారులు మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.

తరగతుల వారీగా సామగ్రి

  • 1-3 తరగతులకు చిన్న, 4-6 తరగతులకు మధ్యతరహా, 7-10 తరగతులకు పెద్ద పరిమాణాల్లో బ్యాగులు అందిస్తారు. బాలురకు నేవీబ్లూ, బాలికలకు స్కైబ్లూ రంగుల సంచులు అందజేయనున్నారు.
  • బూట్లు, సాక్సులకు సంబంధించి గతంలోనే కొలతలు సేకరించారు. ఆ మేరకు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు సరఫరా చేస్తారు.
  • ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు మాత్రమే రాత పుస్తకాలు పంపిణీ చేస్తారు. 1-5 తరగతుల విద్యార్థులకు కొత్తగా రూపొందించిన సిలబస్‌ ప్రకారం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ముద్రించిన పాఠ్య పుస్తకాలతోపాటు ప్రతి సబ్జెక్టుకు వర్క్‌బుక్‌ పంపిణీ చేస్తారు.
  • ఆరో తరగతి వరకు నూతన సిలబస్‌ ప్రకారం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, 7-10 తరగతులకు పాత సిలబస్‌ ప్రకారం ముద్రించిన పాఠ్య పుస్తకాలను అందిస్తారు.
  • జగనన్న విద్యా కానుక Android App లో Mother / Guardian Aadhar నెంబర్ తప్పుగా ఉన్న అసలు ఆధార్ నెంబర్ లేకపోయినా ఏ విధంగా Mother ఆధార్ నెంబర్ అప్డేట్ చేయాలో పూర్తి విధానం క్రింది వీడియోలో చూడగలరు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :