Sunday, October 11, 2020

ITI counseling



Read also:

ఏలూరు ఎడ్యుకేషన్, అక్టోబర్ 10 :ప్రస్తుత విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 13, 14 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏలూరు సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రజిత తెలిపారు. జిల్లాలో ఆరు ప్రభుత్వ, 38 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయని వివరించారు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. నిర్దేశిత మెరిట్ నెంబర్లతో కూడిన అభ్యర్థులు ఆయా తేదీల్లో నిర్ణీత వేళల్లో నిర్వహించే కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐకు హాజరు కావాలని సూచించారు. ఈ నెల 3న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకూ మెరిట్ నెంబర్ 1 నుంచి 75 వరకూ అభ్యర్థులు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మెరిట్ నెంబర్ 76 నుంచి 150 వరకూ, 14వ తేదీ ఉదయం మెరిట్ నెంబర్ 151 నుంచి 225 వరకూ, మధ్యాహ్నం 228 నుంచి 299 వరకూ అభ్యర్థులు హాజరు కావాని కోరారు. వివరాలకు ప్రభుత్వ ఐటీఐ ఫోన్ నెంబర్ 08812230269 లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Popular posts

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :