Saturday, October 10, 2020

Indian Railways reservation rules



Read also:

Indian Railways reservation rules-మీరు రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఎక్కడికైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నారా? అయితే టికెట్ బుక్ చేసే ముందు భారతీయ రైల్వే నియమనిబంధనల్ని తెలుసుకోవడం మంచిది. ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. అవేంటో తెలుసుకోండి.

1. భారతీయ రైల్వే. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ఈ వ్యవస్థ కొన్ని రోజుల పాటు స్తంభించిపోయింది. ఆ తర్వాత దశల వారీగా భారతీయ రైల్వే రైళ్లను నడుపుతోంది.

2. రైళ్లను పరిమితంగా నడుపుతున్నందున టికెట్ బుకింగ్, రిజర్వేషన్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. ఇన్నాళ్లూ కేవలం ఒకే రిజర్వేషన్ చార్టును మాత్రమే ప్రిపేర్ చేసేది భారతీయ రైల్వే.

3. ఇకపై గతంలోలాగా రెండో రిజర్వేషన్ చార్టును ప్రిపేర్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రైలు బయల్దేరడానికి ముందు 30 నుంచి 5 నిమిషాల లోపు రెండో రిజర్వేషన్ చార్ట్‌ను ప్రిపేర్ చేయనుంది రైల్వే.

4. పాత పద్ధతి ప్రకారం రెండో రిజర్వేషన్ చార్టును అక్టోబర్ 10 నుంచి ప్రిపేర్ చేయనుంది భారతీయ రైల్వే. రెండో చార్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు ఆన్‌లైన్‌లో, రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేయొచ్చు.

5. రైలు టికెట్లు బుక్ చేసే ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేందుకు భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతి ప్రకారమే 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేయనుంది.

6. గతంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండు గంటల ముందు చార్టును ప్రిపేర్ చేసేది భారతీయ రైల్వే. ఈ పద్ధతి కొన్ని నెలల పాటు ఇలాగే ఉంది.

7. ఇక మొదటి రిజర్వేషన్ చార్ట్ రైలు బయల్దేరడానికి కనీసం నాలుగు గంటల ముందు ప్రిపేర్ అవుతుంది. మొదటి చార్టులో ఖాళీగా ఉన్న బెర్తుల్ని ప్రయాణికులు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అయ్యే లోగా ఆన్‌లైన్‌లో, రిజర్వేషన్ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు.

8. ఇక అప్పటికే బుక్ చేసిన రైలు టికెట్లను క్యాన్సల్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న రీఫండ్ రూల్స్ వారికి వర్తిస్తాయి. 

9. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి భారతీయ రైల్వే సేవలు నిలిచిపోయాయి. మే 1న శ్రామిక్ రైళ్లను నడపడం ద్వారా రైల్వే సేవల్ని పునరుద్ధరించారు. అప్పట్నుంచి దశలవారీగా రైళ్ల సంఖ్యను పెంచుతోంది రైల్వే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :