More ...
More ...
More ...

Friday, October 30, 2020

Indane Gas Cylinder Booking



Read also:

మీరు ఇండేన్ గ్యాస్ వాడుతున్నారా? ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేస్తుంటారా? అయితే అలర్ట్. ఫోన్ నెంబర్ మారింది. ఎందుకో తెలుసుకోండి.

1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎల్‌పీజీ కస్టమర్లకు కొత్త మొబైల్ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు నవంబర్ 1 నుంచి ఎల్‌పీజీ కావాలంటే 7718955555 నెంబర్‌కే కాల్ చేయాలి.

2. ఇప్పటి వరకు దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఫోన్ నెంబర్లకు కస్టమర్లకు కాల్ చేస్తున్నారు. సిలిండర్లు బుక్ చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా సిలిండర్ బుకింగ్ చేస్తున్నారు.

3. దేశవ్యాప్తంగా వేర్వేరు నెంబర్లు ఉండటం వల్ల కస్టమర్లు వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొత్త నెంబర్ వెతుక్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ అందుబాటులోకి తీసుకురావడం ఊరట కలిగించినట్టైంది.

4. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా 7718955555 నెంబర్‌కు కాల్ చేస్తే చాలు. సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఏకీకృత సదుపాయాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇండేన్ గ్యాస్ ఒకే నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

5. నవంబర్ 1 నుంచి ఇండేన్ గ్యాస్ కస్టమర్లు పాత ఫోన్ నెంబర్లకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. 7718955555 మొబైల్ నెంబర్‌ను సేవ్ చేసుకొని ప్రతీసారి ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు. ఎస్ఎంఎస్ చేయాలన్నా ఇదే నెంబర్ పనిచేస్తుంది. కాబట్టి ఈ నెంబర్‌కే ఎస్ఎంఎస్ పంపాలి.

6. కొంతకాలంపాటు పాత నెంబర్లు కూడా పనిచేస్తాయి. కస్టమర్లు కొత్త నెంబర్‌కు అలవాటయ్యేవరకు పాత నెంబర్ పనిచేస్తుంది. ఆ తర్వాత పాత నెంబర్లను పూర్తిగా నిలిపేసి కేవలం 7718955555 నెంబర్‌ను మాత్రమే యాక్టీవ్‌లో ఉంచుతారు.

7. కస్టమర్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచే ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ చేయడం సాధ్యమవుతుంది. అందుకే కస్టమర్లు మొబైల్ నెంబర్ మార్చినట్టైతే అప్‌డేట్ చేయించాలి.

8. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు వాట్సప్ ద్వారా కూడా సిలిండర్ బుక్ చేయొచ్చు. ఇందుకోసం Refill అని టైప్ చేసి 7588888824 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ పంపాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :