Friday, October 23, 2020

IIIT Entrance Test Notification 2020



Read also:

IIIT Entrance Test Notification 2020

IIIT Entrance Test Notification 2020 - RGUKT IIIT Admissions Test Notification Released. RGUKT IIIT has released the IIIT Common Entrance Test Notification for admission into 4 IIIT University Colleges in Andhra Pradesh. Students who want to get admission in 6 years Engineering Graduation after 10th Class has to appear for Entrance Exam this Year. Details of the IIIT Entrance Test Notification 2020 - RGUKT IIIT Admissions Test Notification Released are as follows:

IIIT Entrance Test Notification 2020 - RGUKT IIIT Admissions Test Notification Released

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి విజయవాడలో ఆర్​జీయూకేటీ పరీక్ష తేదీలను ప్రకటించారు.  నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలలో ప్రవేశాలను ఇప్పటివరకు పదో తరగతి పరీక్షలో గ్రేడ్‌ ఆధారంగా నిర్వహించేవారు. ఈసారి కరోనా దృష్ట్యా పదో తరగతి పరీక్షల నిర్వహణ రద్దు చేయడం.. గ్రేడింగ్‌లు ఇవ్వలేకపోవటంతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనివార్యమైందని మంత్రి సురేశ్ తెలిపారు.

పదో తరగతి సిలబస్‌ ఆధారంగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌లోనే ఓఎమ్​ఆర్ షీట్‌లో సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి గణిత శాస్త్రం నుంచి 50 మార్కులు..  భౌతిక, జీవశాస్త్రాల నుంచి చెరో 25 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని మంత్రి చెప్పారు. తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు ఉండవని స్పష్టంచేశారు. 

నమూనా ప్రశ్నపత్రం, సిలబస్‌ వివరాలను www.rgukt.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు.

ఆర్​జీయూకేటీతోపాటు గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సాఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో రెండు, మూడేళ్ల డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ తేదీల్లోనే నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు.

IIIT_Notification_2020
Exam Dates:

ఫీజు చెల్లించవలసిన తేదీలు : అక్టోబర్ 28-నవంబర్-10

అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: నవంబర్ -15

హాల్ టికెట్ల డౌన్​లోడ్ : నవంబర్ -22 నుంచి

పరీక్ష నిర్వహణ : నవంబర్ -28

ఫలితాల వెల్లడి: డిసెంబర్ -5

100 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసిన ప్రతి మండలంలోనూ ఒక కేంద్రాన్ని ఎంపిక చేస్తామని.. ఒకవేళ వంద కంటే తక్కువ మంది ఉంటే దగ్గరగా ఉన్న సెంటర్‌కు వారిని కేటాయిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో రాయదలచుకున్న అభ్యర్ధుల కోసం 10 కేంద్రాలను గుర్తించామని తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ కేంద్రాల్లో తెలంగాణ ప్రాంత అభ్యర్ధులు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.

IIIT_NOtification_Full_Details

IIIT_NOtification_Full_Details

Press Note

IIIT Entrance test Detailed notification full Details


RGUKT Cet -2020 Model Question Paper

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :