Sunday, October 18, 2020

How to find CPS missing credits step by step process



Read also:

How to find CPS missing credits step by step process

Step 1: కింద ఇచ్లించిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN  నెంబరు, పాస్వర్డ్ enter చేసి login చేయండి.
Step 2: అక్కడ కనిపించిన  investment summary పై క్లిక్ చేయండి.
Step 3: మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement  పై క్లిక్ చేయండి.
Step 4: financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.


How to find CPS missing credits step by step process
  1. మీకు ఆ ఫైనాన్స్  ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.
  2. ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది.
  3. పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి.
  4. ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.

Click here for missing Credits


సిపియస్ ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్స్ వెంటనే పంపాలి DDOలదే పూర్తి బాధ్యత వన్ టైం సెటిల్మెంట్ సద్వినియోగం చేసుకోండి
  • సిపియస్ ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్స్ వెంటనే పంపాలి DDOలదే పూర్తి బాధ్యత వన్ టైం సెటిల్మెంట్ సద్వినియోగం చేసుకోండి రాష్ట్రంలో పనిచేసే సిపిఎస్ ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్స్ ను నవంబర్ 30వ తేదీలోపుగా జీతాల చెల్లింపు శాఖాధికారులు విజయవాడ పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి పంపాల్సిందిగా ఇబ్రహీంపట్నం పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు.
  • రాష్ట్రంలో నూతన పెన్షన్ విధానం 1.9.2004 నుండి ప్రారంభమైనందున ఆంధ్రప్రదేశ్పునర్విభజన చట్టం 2014 ప్రకారం 1.9.2004 నుండి 2.6.2014 వరకు సిపియస్ ఉద్యోగుల పనిచేసిన స్థానాల్లో ఏవైనా మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే పంపవలసిందిగా జీతాల చెల్లింపు అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు.
  • ఒకవేళ ఆ ఉద్యోగి ఒక స్థానం నుండి వేరే స్థానానికి దిదిలీ అయినా పదోన్నతి పొందినా  డిప్యూటేషన్ మీద వెళ్లినప్పటికీ ఆయా ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్స్ బాధ్యత DDOలదే అన్నారు.
  • ఈ పది సంవత్సరాల్లో ఎటువంటి మిస్సింగ్ క్రెడిట్ సిపిఎస్ ఉద్యోగులకు లేనిపక్షంలో DDOలు నో మిస్సింగ్ క్రెడిట్ అని ధృవ పత్రం ఇవ్వాలన్నారు.
  • ఇది వన్ టైం సెటిల్మెంట్ అని నవంబర్ 30వ తేదీలోపల జతపరచిన ప్రొఫార్మాలో ఇవ్వకపోయిన ఎడల తర్వాత ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడవన్నారు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో సిపిఎస్ ఖాతాల్లో సొమ్ము ప్రాస్ అకౌంట్ కి జమ చేయవలసి ఉన్నందున జీతాల చెల్లింపు అధికారులు ఈ విషయంలో తగు బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని పే అండ్ ఎకౌంట్స్ ఆఫీసర్ విజ్ఞప్తి చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :