Thursday, October 29, 2020

Here are some tips to help you get rid of mosquitoes easily



Read also:

సులువుగా దోమలను తరిమికొట్టేందుకు పాటించాల్సిన చిట్కాలివే

దోమలు చూడటానికి చిన్న సైజులోనే కనిపించినా వాటి వల్ల మనం పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మనం ఎన్నో రోగాల బారిన పడటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోమలు కారణమవుతాయి. ఇంట్లో ఎక్కువ సంఖ్యలో దోమలు ఉంటే ప్రశాంతంగా నిద్ర కూడా పోలేం. కొంతమంది దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి మస్కిటో కాయిల్స్, బాడీ క్రీమ్స్ పై ఆధారపడతారు.

అయితే వాటి వల్ల తాత్కాలికంగా ప్రయోజనం చేకూరినా నష్టాలే ఎక్కువగా ఉంటాయి.

అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులువుగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. వెల్లుల్లి దోమలను సులువుగా నివారించే ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. నీళ్లలో వెల్లుల్లి రెబ్బలను మరిగించి ఆ ద్రావణాన్ని ఇంట్లో పిచికారీ చేస్తే ఇంట్లోకి దోమలు రావు. ఇంట్లో ఏదో ఒక మూల పుదీనా ఆకులను ఉంచినా ఆ ఆకుల నుంచి వచ్చే సువాసన దోమలను ఇంటినుంచి తరిమికొడుతుంది.

మనం హారతి కోసం ఎక్కువగా వినియోగించే కర్పూరం కూడా దోమలను తరిమికొడుతుంది. కర్పూరాన్ని చిన్న ప్లేట్ లాంటి వస్తువులో తీసుకుని అరగంట పాటు మూసి ఉన్న గదిలో ఉంచితే దోమల వల్ల సమస్యలు రావు. లావెండర్ నూనెను సైతం దోమల నుంచి రక్షణగా వినియోగించుకోవచ్చు. ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో లావెండర్ నూనెను పిచికారీ చేస్తే దోమలా బెడద నుంచి బయటపడవచ్చు.

కాఫీ పౌడర్ సైతం దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. దోమలు సాధారణంగా నిలకడగా ఉన్న నీటిలో గుడ్లను పెడతాయి. దోమలు గుడ్లు పెట్టిన చోట్ల కాఫీ పౌడర్ ను చల్లితే దోమలల లార్వాలు చనిపోతాయి. ఈ చిట్కాలను పాటించి సులువుగా దోమలకు చెక్ పెట్టవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :