Thursday, October 29, 2020

Health Tip



Read also:

భోజనం చేసిన తర్వాత అసలు చేయకూడని పనులు ఇవే.!

చాల మంది టైంకి భోజనం చేయరు. దింతో మన ఆరోగ్యానికి మనమే చేజేతులా పాడు చేసుకుంటున్నామని నిపుణులు చెబుతున్నారు. అయితే తిన్న వెంటనే కొన్ని పనులు చేయడం వలన ప్రాణాలకే ముప్పు రావొచ్చు. అదేంటో చూద్దామా. తిన్న వెంటనే ఈత కొట్టడం చాలా ప్రమాదకరం. దీని ద్వారా కడుపు తిమ్మిరికి వచ్చే ప్రమాదం ఎక్కువ. తిన్న తర్వాత ఈత కొడితే జీర్ణక్రియ భాగా పనిచేస్తుందని అంటుంటారు. అయితే ఈతకు జీర్ణక్రియకు సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయడం అంటే కొత్త రోగాలను కొని తెచ్చుకోవడమే అంటున్నారు. న్యూట్రీషియన్లు. వ్యాయామం చేయక ముందు గానీ, చేసిన తర్వాత గానీ. తినడానికి రెండు గంటల సమయం కేటాయించాలని చెబుతున్నారు. తిన్న వెంటనే వ్యాయామం చేస్తే. అది కడుపు వికారం చెందడం, తిమ్మిర్లు రావడం ఖాయమని అంటున్నారు. అయితే సాధారణ నడక తో పెద్దగా నష్టాలేమీ ఉండవని సూచిస్తున్నారు. పుష్టిగా భోజనం చేసిన తర్వాత నిద్ర ముంచుకొస్తుంటే ఎవరాపుతారు.? ఎంత పనున్నా సరే. ఒక ఇరవై నిమిషాలైనా పడుకుంటాం అనుకుంటారు. ఇక రాత్రి పూటైతే వేరే చెప్పాలా.? కానీ ఇది అత్యంత ప్రయాదకరం. తిన్న తర్వాతే నిద్రపోతే అది ఊబకాయానికి బాటలు వేసినట్టే. అంతేగాక గుండెల్లో మంట, ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయట.

తిన్న తర్వాత కనీసం రెండు గంటలైనా వేచి ఉండాలని. అప్పుడే నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయడం కూడా ప్రమాదమేనట. అది మన శరీర ఉష్ణోగ్రతను అమాంతం పెంచుతుందట. ఈ క్రమంలో మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో ఉండే జీర్ణక్రియకు ఆటంకం కలిగించినట్టేనట. దీంతో ఇది దాని పని సక్రమంగా చేయక లేనిపోని రోగాలు తలెత్తే అవకాశాలు ఎక్కువట. తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి గంట దాకా స్నానం గురించి మరిచిపోతే మంచిదని నిపుణుల సూచన.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :