Wednesday, October 7, 2020

Health benefits of Almonds



Read also:

బాదం పప్పులు కాస్త రేటు ఎక్కువే. కానీ. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతకంటే ఎక్కువ. కాబట్టి. ప్రతి ఒక్కరూ రోజూ బాదం పప్పులు తింటే. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.


నోటికి రుచికరమైనవి చాలా వరకూ. శరీరానికి మంచివి కావు. కానీ. బాదం పప్పుల విషయంలో ఈ రూల్ వర్తించదు. అవి చాలా రుచికరంగా ఉంటాయి. పైగా. ఎన్నో విటమిన్లు వాటిలో ఉంటాయి. అవి మనల్ని అత్యంత అందంగా, ఆరోగ్యంగా మార్చేస్తాయి. అందువల్ల మనం కాస్ట్ ఎక్కువైనప్పటికీ. బాదం పప్పులను రోజూ తినాలి. కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజూ గుప్పెడు దాకా తినేస్తుంటారు. అలా మాత్రం తినకూడదు. ఎందుకంటే. ఏదైనా అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదమే. ముఖ్యంగా బాదం పప్పులు మరీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయి. కాబట్టి. రోజూ యావరేజ్‌గా 4 పప్పులు తినాలి. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి. స్లిమ్‌గా తయారవుతాం. ఈ సందర్భంగా. రోజూ 4 బాదంలు తింటే (పచ్చివైనా, వేపినవైనా, కూరల్లో, స్నాక్స్‌లో వేసుకొని అయినా) కలిగే ఆరోగ్య ప్రయోజనాల్నీ, మనలో వచ్చే శారీరక మార్పుల్నీ చకచకా తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ అవుట్ : చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలోంచీ సైలెంట్‌గా చెక్కేయాలంటే. మనం బాదం పప్పులు తినాలి. ఒకవేళ శరీరంలో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటే. రోజుకు 20 నుంచీ 30 బాదం పప్పులైనా తినాల్సిందే. ఫలితంగా వేడి బాగా పెరిగి. కొవ్వు కరుగుతుంది.

ఆరోగ్యకరమైన జుట్టు : మన జుట్టుకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ. బాదంలలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, ధ్రుడంగా పెంచే మెగ్నీషియం, జింక్ వంటివీ, విటమిన్ E బాదంలలో ఉంటాయి. అలాగే. జుట్టును ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ B. బాదంపప్పుల్లో ఉంటుంది.

గుండె హ్యాపీగా ఉంటుంది : బాదంలలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమికొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు గుండె సంతోషంగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బులు దూరమవుతాయి. బాదంలను తొక్కతో సహా తినండి. గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది.

ముసలితనానికి చెక్ : జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతల వంటివి వస్తుంటే. మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాల్సిందే. ఎందుకంటే. వాటిలోని మాంగనీస్. కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. ఇక విటమిన్ E చర్మాన్ని కాపాడటమే పనిగా పెట్టుకుంటుంది. అందువల్ల రోజూ బాదం పప్పులు తినేవాళ్లకు త్వరగా ముసలితనం రాదు. ఈ సీక్రెట్ కనిపెట్టిన కాస్మొటిక్ కంపెనీలు. బాదంలను మాయిశ్చరైజింగ్ క్రీముల్లో చాలా ఎక్కువగా వాడుతున్నాయి. మనం ఆ క్రీముల బదులు బాదంలనే తింటే సరి.

మంచి బ్యాక్టీరియాకి మేలు : మన బాడీలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అవి మనకు మేలు చేస్తుంటాయి. అవి లేకపోతే మనం చనిపోతాం. కాబట్టి. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే. అందుకోసం బాదం పప్పులు తినాలి. ఎందుకంటే. ఆ పప్పులపై ఉండే తొక్కలో. ప్రీబయోటిక్స్ ఉంటాయి. అవి మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి. పొట్టలో నొప్పి, ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా, ఆహారం సరిగా జీర్ణం కావట్లేదని అనిపించినా. మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాలి. మీలాంటి వాళ్లు రోజుకు 30-35 బాదం పప్పులు తినాలి. ఆరోగ్యం బాగానే ఉన్నవారు మాత్రం రోజుకు 4 తింటే చాలు.

బరువు తగ్గాలంటే తినాల్సిందే : బాదం పప్పులు విపరీతంగా వేడి చేస్తాయి. ఒక్కసారి అవి బాడీలోకి వెళ్లాయంటే చాలు. చెడు కొవ్వు ఎక్కడున్నా. పెట్టే బెడా సర్దుకొని పారిపోవాల్సిందే. కారణం వాటిలోని విటమిన్లు, ఫైబరే. కాబట్టి. తింటే బరువు పెరిగిపోతామేమో అని ఆలోచించేవారు సైతం. బాదం పప్పులను మాత్రం తినడం మంచిదే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :