Sunday, October 18, 2020

Google news



Read also:

గూగుల్ హ్యాంగ్అవుట్స్ నిష్క్రమణకు ముందే దాంట్లో అందుబాటులో ఉన్న కొన్ని సేవలకు ముగింపు పలకాలని గూగుల్ నిర్ణయించింది.


గూగుల్ మెసేజింగ్ యాప్ హ్యాంగ్ అవుట్స్ 2021 ప్రథమార్ధంలో అధికారికంగా సేవలను విరమించుకోనుంది. ప్రస్తుతం హ్యంగ్ అవుట్స్‌ వాడుతున్న వారు గూగుల్ చాట్ యాప్‌కు మారుతారని ఆ సంస్థ ప్రకటించింది. గూగుల్ వర్క్ స్పేస్ (జి సూట్) కస్టమర్లకు ప్రస్తుతం గూగుల్ చాట్ అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. Hangouts నుంచి చాట్‌కు మారిన కస్టమర్ల చాట్ లిస్ట్, కన్వర్జేషన్స్, కాంటాక్ట్స్, సేవ్డ్ హిస్టరీ వంటివన్నీ గూగుల్ చాట్‌కు మారుతాయని ఆ సంస్థ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం Google ప్లాట్ ఫాంలలో ఉన్న హ్యాంగ్ అవుట్స్‌ను ఆ సంస్థ తొలగిస్తుంది. లేదంటే దాని స్థానాన్ని గూగుల్ చాట్, గూగుల్ మీట్లతో భర్తీ చేస్తుంది.

గతంలో తీసుకున్న నిర్ణయమే

ఈ మార్పు ఎప్పటి వరకు పూర్తవుతుందనేది గూగుల్ ప్రకటించలేదు. గతంలోనే Hangouts వినియోగదారులను గూగుల్ చాట్, గూగుల్ మీట్‌కు తరలించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గూగుల్ చాట్‌కు హ్యాంగవుట్స్ యూజర్లను మారుస్తోంది. గూగుల్ చాట్‌కు సొంతంగా ఒక యాప్ ఉంటుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు Gmail యాప్, Gmail వెబ్లోని గూగుల్ సర్వీసెస్ విభాగంలో ఈ సేవలను వాడుకోవచ్చు. ప్రస్తుతానికి గూగుల్ వర్క్ స్పేస్ కస్టమర్ల కోసం Gmail యాప్‌లో మాత్రమే గూగుల్ చాట్‌ను అందుబాటులో ఉంచారు. Hangoutతో పోలిస్తే గూగుల్ చాట్‌లో వినియోగదారులు అదనపు ఫీచర్లను పొందుతారు. వీటిల్లో ఫాస్ట్ సెర్చింగ్, ఈమోజీ రియాక్షన్స్ వంటివి ఉన్నాయి. సెక్యూరిటీ విభాగాన్ని కూడా మెరుగుపరిచారు.

ఇతర మార్పులు

Hangoutsలో విలీనం చేసిన Google Fi సేవలను ఇప్పుడు Google మెసేజెస్‌లో కొనసాగించుకోవచ్చు. Google Fiని వాడేవారు మెసేజెస్ ఫర్ వెబ్ ఆప్షన్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వాయిస్ మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ మార్పు ఈ నెలలోనే ప్రారంభమవుతుందని గూగుల్ ప్రకటించింది. గూగుల్ వాయిస్ యూజర్లు ఇప్పుడు ఉచిత కాలింగ్ సేవల కోసం వాయిస్ యాప్‌‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఆ సేవలకు ముగింపు

గూగుల్ హ్యాంగ్అవుట్స్ నిష్క్రమణకు ముందే దాంట్లో అందుబాటులో ఉన్న కొన్ని సేవలకు ముగింపు పలకాలని గూగుల్ నిర్ణయించింది. ప్రస్తుతం ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉన్న సేవలను ఈ సంవత్సరం చివరి నాటికి ఆపేస్తారు. కొత్త టెలికమ్యూనికేషన్ నిబంధనల కారణంగా ఈ నెలలోనే యూరోపియన్ యూనియన్, అమెరికాలోని Hangouts వినియోగదారులకు అందుబాటులో ఉన్న 'కాల్ ఫోన్స్' ఫీచర్‌ను గూగుల్ తొలగించనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :