Friday, October 9, 2020

Flipkart Amazon Offers



Read also:

💥ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

◆మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)👇👇👇* 

                                                             CHECK HERE 👇👇👇

Flipkart Amazon Offers-Mega sale

దసరాకు ముందు ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ఆఫర్లతో పోటీ పడనున్నాయి.

కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలకు పండుగ సీజన్ వరంలా మారింది. దసరా, దీపావళికి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ కామర్స్ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దసరాకు ముందు ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ఆఫర్లతో పోటీ పడనున్నాయి. ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అక్టోబరు 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాలు అక్టోబరు 17 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థల నుంచి ఏయే స్మార్ట్‌ఫోన్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఉన్నాయో పరిశీలిద్దాం.


1. LG G8X స్మార్ట్ ఫోన్

ఎల్జీ జి8 ఎక్స్ డ్యుయల్ స్క్రీన్ ఫోన్ ధరను రూ.35,000 వరకు తగ్గించి అమ్మనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. దీన్ని ఈ సీజన్‌లో కస్టమర్లకు లభించే అతి పెద్ద డిస్కౌంట్‌గా చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ను గత డిసెంబరులో రూ.49,999 వద్ద మార్కెట్‌లో విడుదల చేశారు. ఆ తరువాత GST పెరగడంతో ధరను రూ.54,990గా నిర్ణయించారు. దీన్ని ఇప్పుడు రూ.19,990కే కొనుక్కోవచ్చు. ఆఫర్ కొద్దిరోజులకే అని ఎల్జీ ప్రకటించింది.

2.iPhone 11

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఐఫోన్ 11 ను రూ.50 వేల కన్నా తక్కువకు అందిస్తున్నట్టు అమెజాన్ తెలిపింది. ఐఫోన్ 11 ధర రూ.68,300 వరకు ఉంటుంది. పండుగ ఆఫర్లో భాగంగా దీన్ని అమెజాన్ చాలా తక్కువ ధరకు అమ్మనుంది.

3. OnePlus Nord

వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్‌ను కొన్ని నెలల క్రితం భారత్‌లో లాంచ్ చేశారు. ప్రారంభ ధరను రూ.24,999గా నిర్ణయించారు. కానీ ఈ వేరియంట్‌ను సెప్టెంబర్ వరకు అమ్మకానికి మార్కెట్లోకి విడుదల చేయలేదు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా OnePlus Nord స్మార్ట్ ఫోన్ను తక్కువ ధరకే అందిస్తామని అమెజాన్ ప్రకటించింది. తగ్గింపు ఎంత వరకు ఉంటుందని ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేదు. కానీ వెబ్‌సైట్‌లో కంపెనీ పేర్కొన్న వివరాలను బట్టి దీని ధర రూ.20,999 నుంచి రూ.24,999 మధ్య ఉండవచ్చు.

4. Alexa-powered Echo speakers

తమ సంస్థ నుంచి వచ్చిన అన్ని రకాల ఎకో స్పీకర్ల ధరలనూ అమెజాన్ తగ్గించి అమ్మనుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా వీటిపై 50 శాతానికి పైగా డిస్కౌంట్ ఇస్తోంది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం... ఎకో డాట్ థర్డ్ జెనరేషన్ స్పీకర్ ధరను రూ.4,499 నుంచి రూ.2,249కు తగ్గించింది. ఎకో ఇన్పుట్ రూ.2,749(అసలు ధర రూ.5,999), ఎకో థర్డ్ జెన్ రూ.6,999(అసలు ధర రూ.9,999)కు, ఎకో డాట్ విత్ క్లాక్ రూ.2,749(అసలు ధర రూ.5,499), ఎకో ప్లస్ రూ.7,499(అసలు ధర రూ.14,999), ఎకో స్టూడియో రూ.18,999(అలసు ధర రూ.22,999) తక్కువ ధరలకే లభించనున్నాయి.

5. Xbox Series S

ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ గేమింగ్ కన్సోల్‌ను కొన్ని వారాలకు ముందే భారత్‌లో విడుదల చేశారు. దీని ధరను రూ.34,990గా నిర్ణయించారు. బిగ్ బిలియన్ డే సేల్స్‌లో భాగంగా దీనిపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో రానున్న ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ గేమింగ్ కన్సోల్‌ను రూ.29,999వద్ద తక్కువ ధరకే అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

6.Samsung Galaxy S20+

బిగ్ బిలియన్ సేల్స్‌లో గెలాక్సీ ఎస్ 20ప్లస్ మోడల్ ఫోన్‌ను రూ.49,999కే అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ.83,000. దీంతో పాటు సామ్‌సంగ్ ఫోన్లపై స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌ను అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్. ఈ స్కీమ్‌లో భాగంగా వినియోగదారులు ఫోన్ ధరపై 70 శాతం మాత్రమే చెల్లించవచ్చు. ఒక సంవత్సరం తర్వాత దీన్ని మార్చుకునేలా నియమ నిబంధనలు ఉన్నాయి.

7. Motorola Moto Edge+

మోటో ఎడ్జ్ ప్లస్ మోడల్ అసలు ధర రూ.89,999. ఆఫర్‌లో భాగంగా ఇది రూ.69,999కే లభిస్తోంది. దీని కొనుగోలుపై ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి.

8. Samsung Galaxy M51

ఈ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో రూ.28,999కు విడుదల చేశారు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో దీనిపై డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. ఎంత వరకు తగ్గింపులు ఉంటాయని ప్రకటించలేదు. కానీ దీని తుది ధర రూ.20,999 నుంచి రూ.28,999 మధ్య ఉండవచ్చు.

9. Realme X50 Pro 5G

భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి 5జి ఫోన్‌గా దీనికి గుర్తింపు దక్కింది. దీని ప్రారంభ ధరను రూ.41,999గా నిర్ధారించగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రూ.36,999కే లభించనుంది. AMOLED స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటోంది.

10. Redmi Note 9 Pro

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను డిస్కౌంట్‌తో అమ్ముతామని అమెజాన్ తెలిపింది. రెడ్‌మీ నోట్ 9 ప్రో ధర తగ్గడం ఇదే మొదటిసారి. తగ్గింపు ఎంత వరకు ఉంటుందో ఇంకా ప్రకటించలేదు. దీని ప్రస్తుత ధర రూ.16,999 కాగా, డిసౌంట్ తరువాత రూ.10,099 నుంచి తుది ధరలు ఉండే అవకాశం ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :