Thursday, October 8, 2020

Enable whats app security process



Read also:

Enable whats app security process-సెట్టింగ్స్‌లో చిన్న మార్పుతో మీ డేటా సేఫ్
సైబర్‌ ప్రపంచాన్ని హ్యాకర్లు హడలెత్తిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్  ను సైతం హ్యాకర్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉందని వాట్సాప్‌ డెవలపర్లు చెబుతున్నా ఆ ఫీచర్‌.పేరుకే పరిమితమవుతోంది. మనం చేసే మెసేజులు, పంపించే వీడియోలు మూడో వ్యక్తి కంటపడవని వాట్సాప్‌ ప్రకటిస్తున్నా హ్యాకర్లు ఈజీగా తమ పని కానిచ్చేస్తున్నారు.
Whatsapp_Security


ఇటువంటి తరుణంలో వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో చిన్నచిన్న మార్పులు చేస్తే ఇక మీ చాటింగ్‌ మొత్తం సురక్షితంగా ఉంచుకోవచ్చు.
వాట్సాప్‌లోని చాటింగ్‌ డేటా డిఫాల్ట్‌గా ప్రతిరోజూ గూగుల్‌ డ్రైవ్‌లోకి బ్యాకప్‌ అవుతుంటుంది. గూగుల్‌ డ్రైవ్‌లోని సమాచారానికి కూడా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉందని చెబుతున్నా ఇక్కడి నుంచే ఎక్కువగా యూజర్ల డేటా లీక్‌ అవుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. చాట్‌ డేటా బ్యాకప్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలి.
దీని కోసం ఏం చేయాలంటే
  • ముందుగా వాట్సాప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌ 'ఆప్షన్‌' క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు మరో మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో డార్క్‌ కలర్‌లో కనిపించే 'బ్యాకప్‌'పై క్లిక్‌ చేయాలి.
  • మొత్తం ఐదు ఆప్షన్లు ఓపెన్‌ అవుతాయి. అందులో 'never' లేదా 'only when i tap backup' ఆప్షన్లను సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్‌ చేస్తే ఇకపై ఆటోమేటిక్‌గా బ్యాకప్‌ ప్రాసెస్‌ జరగదు. చాటింగ్‌ డేటా కూడా గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ అవదు.
  • ఒకవేళ ఎప్పుడైనా చాటింగ్‌ డేటా బ్యాకప్‌ తీసుకోవాలనుకున్నా వైఫై ద్వారా కాకుండా మొబైల్‌ డేటా ద్వారానైతే హ్యాకర్ల బారిన పడకుండా నిరోధించవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :