Friday, October 9, 2020

Do you know how many hours the corona virus stays on the skin



Read also:

Do you know how many hours the coronavirus stays on the skin

కరోనా వ్యాప్తి ప్రారంభమైననాటినుంచి దానిపై పరిశోధకులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త విషయం తెలుస్తోంది.


అదే సమయంలో ఒక్కొక్క అధ్యయనంలో ఒక్కోరకం చేదునిజాలు బయటపడుతున్నాయి. అయితే, కరోనా వైరస్‌ అనేది మన చర్మంపై తొమ్మిది గంటలు జీవించగలదని తాజా అధ్యయనంలో తేలింది.

జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు కరోనా రోగుల మృతదేహాలపై ఈ అధ్యయనం నిర్వహించారు.

కరోనా చర్మంపై 9 గంటల వరకు జీవించగలదని తేల్చారు. ఫ్లూ వైరస్‌ కంటే ఇది ఎక్కువసేపు చర్మంపై ఉంటుందని తెలిపారు.

ఫ్లూ వైరస్‌ చర్మంపై కేవలం 1.8 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ అధ్యయన అక్టోబర్ 3 న ఆక్స్‌ఫర్డ్‌ అకాడెమిక్ ఇన్ క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురితమైంది. ఇదిలా ఉండగా, 80 శాతం ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌తో చేతిని శుభ్రంచేసుకుంటే 15 సెకన్లలోపు వైరస్‌ అంతం అవుతోందని కూడా గుర్తించారు.

సార్స్‌-సీవోవీ-2 ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నివారించడానికి సరైన చేతి పరిశుభ్రత ముఖ్యం అని తమ అధ్యయనం చెబుతున్నదని పరిశోధకులు అంటున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :