Thursday, October 8, 2020

Do not install the below 2 apps

Read also:

Do not install the below 2 apps-Cyber Alert

సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో కూర్చొని స్మార్ట్ ఫోన్ సాయంతో దోపిడీలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ బెడ్‌రూమ్ రహస్యాలను కూడా నెట్టింట రచ్చకెక్కిస్తున్నారు. ఒకే ఒక్క క్లిక్‌తో జీవితాలను నాశనం చేస్తున్నారు అందుకే ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

టీమ్ వ్యూయర్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. kyc అప్‌డేట్ చేయాలన్న పేరుతో ఎనీ డెస్క్ (Any desk) లేదా టీమ్ వ్యూయర్ క్విక్ సోపర్ట్ (Team Viewr Quick support) యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు అడిగే అవకాశముంది తెలిపారు.

ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ క్విక్ సపోర్ట్ యాప్స్.. రిమోట్ యాక్సెస్ అప్లికేషన్లు. వాటి ద్వారా మీ స్మార్ట్ ఫోన్లు, పీసీలు కేటుగాళ్ల ఆధీనంలోకి వెళ్తాయి.ఎక్కడో కూర్చొని ఈ రిమోటో యాక్సెస్ సాయంతో మీ ఫోన్, పీసీల్లోని ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదముంది.

అందుకే గుర్తు తెలియని వ్యక్తులు ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ క్విక్ సపోర్ట్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయాలని కోరితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనవసర లింకులను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.

ఒకవేళ మీరు ఇప్పటికే ఈ రెండు యాప్స్‌ను వినియోగిస్తున్నట్లయితే భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అనసవర లింకులను క్లిక్ చేయకపోవడంతో పాటు ఎనీ డెస్క్ ఐడీని అపరిచితులతో షేర్ చేసుకోవద్దని హెచ్చ రిస్తున్నారు. అందకే బీ అలర్ట్.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :