Saturday, October 24, 2020

DA payment to AP government employees



Read also:

DA payment to AP government employees

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నలిచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018 నాటి మొదటి డీఏను జనవరి జీతాల్లో చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వంపై రూ.1,035 కోట్ల భారం పడనుంది. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జులై జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. రెండో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.2,074 కోట్ల భారం పడనుంది. జులై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించింది. మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.3,802 కోట్ల భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను జీపీఎస్‌లో 3 వాయిదాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి పొందుతారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :