Thursday, October 8, 2020

BSNL Broadband Offers



Read also:

దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన 50 జిబి సియుఎల్ మరియు 120 జిబీ సీయూఎల్ ప్లాన్లను అండమాన్ నికోబర్ మినహా దేశమంతటా విస్తరించింది బీఎస్ఎన్ఎల్.


బ్రాడ్‌బ్యాండ్ రంగంలో అద్భుతమైన సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులకు సోమవారం కొత్త ప్రొమోషనల్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 777లకు అందుబాటులో ఉండే 500GB CUL పేరుతో వచ్చే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌లలో మార్పులు చేసింది. కాగా, ఇదివరకే అందుబాటులో ఉన్న ఈ ప్లాన్‌ను 2018 చివరిలో ఉపసంహరించుకుని, 2019 ప్రారంభంలో తిరిగి ప్రవేశపెట్టింది బీఎస్ఎన్ఎల్.

500GB CUL ప్లాన్ 2020 జూన్ వరకే అందుబాటులో ఉంటుందని ఈ ఏడాది ప్రారంభంలోనే బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ వంటి కొన్ని సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌ను 2020 సెప్టెంబర్ 24 వరకు పొడిగించగా, ఇతర సర్కిల్స్‌కు 2020 సెప్టెంబర్ 25 వరకు అందుబాటులో ఉంచారు. అయితే తాజాగా ఈ ప్లాన్‌ను అదే ధరకు 100 ఎమ్బిపిఎస్ స్పీడ్ వరకు పెంచింది.

రూ.777 అందుబాటులో ఉండే ఈ ప్లాన్ 500 జీబీ వరకు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను అందిస్తున్నామని, డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 5 ఎంబీపీఎస్‌కు తగ్గించబడుతుందని బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఈ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులకు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్‌లో గతంలో 500GB వరకు 50 Mbps ఇంటర్నెట్ వేగంతో మాత్రమే బ్రౌజింగ్‌కు అవకాశం ఉండేది. దీని తర్వాత ఇంటర్నెట్ వేగం 2 Mbps కు తగ్గించబడేది. అయితే, నూతనంగా సవరించిన దాని ప్రకారం ప్లాన్‌లో భాగంగా ఇంటర్నెట్ స్పీడ్‌ను 100 ఎంబీపీఎస్‌కు పెంచింది. అండమాన్ మరియు నికోబార్ దీవులు మినహా భారతదేశం అంతటా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ప్రమోషనల్ బేసిస్‌పై 90 రోజుల కాలానికి ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ పేర్కొంది.

అయితే ఈ నూతన ప్లాన్‌లో చేరిన వినియోగదారులు ఒక నెల ఛార్జీని సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ప్లాన్‌లో చేరిన వినియోగదారులు ఆరు నెలల తర్వాత 600GB CUL ప్లాన్‌కు మార్చబడతారు. ప్రతినెలా 849 రూపాయలు చెల్లించాల్సిన ఈ ప్లాన్‌లో 50 Mbps ఇంటర్నెట్ వేగంతో 600GB వరకు బ్రౌజింగ్ చేయవచ్చు. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గించబడుతుంది.

ఈ ప్లాన్‌లు దేశమంతటా అందుబాటులోకి..దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన 50 జిబి సియుఎల్ మరియు 120 జిబీ సీయూఎల్ ప్లాన్లను అండమాన్ నికోబర్ మినహా దేశమంతటా విస్తరించింది బీఎస్ఎన్ఎల్. తమ నూతన వినియోగదారులకు ప్రమోషనల్ బేసిస్‌పై 90 రోజుల కాలానికి గాను ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. 50GB CUL ప్లాన్ ద్వారా 20 Mbps ఇంటర్నెట్ వేగంతో 50GB వరకు బ్రౌజింగ్‌కు అవకాశం ఉంటుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 1 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ వేగం తగ్గించబడుతుంది. అదేవిధంగా, 120GB CUL ప్లాన్ ద్వారా వినియోగదారులు 120GB వరకు 20 Mbps వేగాన్ని బ్రౌజ్ చేసే వీలుంటుంది.

డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 1 Mbps కు తగ్గించబడుతుంది. 50GB CUL ప్లాన్ కోసం ప్రతినెలా రూ .299లను చెల్లించాల్సి ఉండగా, 120GB CUL ప్లాన్కు రూ. 491 చెల్లించాలి. 50GB CUL మరియు 120GB CUL ప్లాన్లను ఎంచుకునే వినియోగదారులు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ .500 చెల్లించాలి. కాగా వీరికి భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను చేసుకునే అవకాశం ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :