Saturday, October 10, 2020

Be careful android users



Read also:

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిస్తోంది. ఆ మొబైల్‌ ఫోన్‌లే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్న రాన్సమ్‌వేర్ వైరస్‌ను గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. మాల్‌లాకర్‌.బి (MalLocker.B)గా పిలవబడే రాన్సమ్‌వేర్‌ ఆన్‌లైన్ వేదికలు, వెబ్‌సైట్ల ద్వారా దాడి చేస్తుందని పేర్కొంది. అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో దాగి ఉంటుందని తెలిపింది. వెబ్‌సైట్ల నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని మైక్రోసాఫ్ట్‌ సూచించింది. మాల్‌వేర్ కోడ్‌ సులువుగా మల్టిపుల్‌ ఫోన్స్‌కు విస్తరిస్తుందని చెప్పింది. యూజర్లు ఎవరైనా సరే తెలియని సోర్స్‌ నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయకుండా ఉండాల్సిందే అని తెలిపింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :