Wednesday, October 7, 2020

AP Ration card applying process



Read also:

AP Ration card applying process

పేదలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైనది..విలువైనది. రేషన్ కార్డుతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో సరుకులు పొందడమే కాదు.. పలు ప్రభుత్వ పథకాలుకు అర్హత సాధించాలన్న రేషన్ కార్డు తప్పనిసరి. ఐతే ఏపీలో పలువురి తెల్ల రేషన్ కార్డు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వారందరికీ మరో అవకాశం కల్పిస్తోంది.


ఏపీలో చాలా మంది రేషన్ కార్డు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వారంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తమకు ఇక రేషన్ కార్డు రాదేమోనని కంగారు పడాల్సిన పనిలేదు. అలాంటి వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది.
నవశకం కార్యక్రమం ద్వారా ఇదివరకు తెల్ల రేషన్ కార్డులు తిరస్కరించబడిన లబ్ధిదారులు మరలా తెల్ల రేషన్ కార్డు పొందేందుకు వాస్తవిక ఆధారాలతో దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశము కల్పిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగి, మోటార్ కారు కలిగినవారు, ఆదాయపన్ను దారులు, పరిమితికి మించి సొంత భూమి కలిగిన వారు, అత్యధిక యూనిట్లలో విద్యుత్ ఉపయోగించినవారు, బహుళ బంధుత్వాలు ( పెళ్లి అయిన వారు, తొలగింపు / నమోదు) కారణాల వలన తెల్ల రేషన్ కార్డుకు అనర్హులైన లబ్ధిదారులు సహేతుక ఆధారాలు సమర్పించి తిరిగి తెల్ల రేషన్ కార్డు పొందవచ్చును.
తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు ఇదివరకు అనర్హత కలిగిన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు, సదరు కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును రేషన్ కార్డు దరఖాస్తుతో జతచేసి తమ సమీపంలోని గ్రామ-వార్డు సచివాలయాల్లో సమర్పించాలి.
సంబంధిత గ్రామ-వార్డ్ సచివాలయ సిబ్బందిచే ఆరు దశల మూల్యాంకనం ద్వారా ఇదివరకు అనర్హత పొందిన వారు మరల తెల్ల రేషన్ కార్డుకు అర్హత పొందే అవకాశాలు ఉన్నాయి.  ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వ సూచించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :