Friday, October 16, 2020

AP eamcet counselling



Read also:

AP EAMCET Counselling Schedule will be announced today

ఏపీ ఎంసెట్ కౌన్సెల్లింగ్ శుక్రవారం ప్రకటన జారీ చేయనున్నారు. ఎంసెట్లో అర్హత సాధించిన వారికి కన్వీనర్ కోటా కింద సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 22 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, ప్రాసెసింగ్ రుసుము చెల్లింపునకు అను మతించనున్నారు. ఈ నెల 26 నుంచి కళాశాలల ఎంపిక కోసం ఐచ్చికాలకు అవకాశం ఇస్తారు. ఇంజినీరింగ్ కళాశాలలకు ఇంతవరకు రుసుములు ఖరారు కాలేదు. కళాశాలలు, సీట్ల వివరాల లెక్క తేలలేదు. సెప్టెంబరు 15 నాటికి కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆదేశించినా రాష్ట్రంలో ఇప్పటికీ కసరత్తు కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ఉండవు: వారానికి ఆరురోజులు తరగతులు నిర్వహిస్తారు. పండగ సెలవులు రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటాయి. వేసవి సెలవులు ఉండవు. నవంబర్ 2నుంచి ప్రారంభమయ్యే తరగతులు వచ్చే ఏడాది ఆగస్టు 21వరకు కొనసాగుతాయి. సెప్టెంబరు నుంచి 2021-2022 కొత విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. పాఠ్యాంశాల తగ్గింపు ఉండదు. సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :