Thursday, October 22, 2020

Amazon Great Indian Festival



Read also:

ఈ పండుగ సీజన్లో ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా టిడబ్ల్యుఎస్ ఇయర్ ఫోన్‌లను రూ.5,000లోపే పొందొచ్చు. 5 వేలలోపు అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ పై ఓ లుక్కేయండి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ కంపెనీల స్మార్ట్ ఉత్పత్తులు, మొబైల్ యాక్ససరీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అనేక స్మార్ట్‌ఫోన్‌లు సాంప్రదాయ 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ సపోర్ట్ తో వస్తున్నందున ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ (టిడబ్ల్యుఎస్) మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఇయర్బడ్స్ ఈజీ పోర్టబిలిటీతో పాటు గొప్ప బ్యాటరీ లైఫ్ను అందిస్తున్నాయి. వీటిలో గొప్ప ఆడియో క్వాలిటీతో కూడిన సౌండ్ సిస్టమ్‌ కూడా ఉంటుంది. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ సాధారణంగా రూ.10,000 నుంచి లభిస్తాయి. అయితే, దాదాపు అదే క్వాలిటీతో 10,000 కంటే తక్కువ ధరకే షియోమి, క్రాస్‌బీట్స్, జాబ్రా, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లు టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ ను అందిస్తున్నాయి. ఈ పండుగ సీజన్లో ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా టిడబ్ల్యుఎస్ ఇయర్ ఫోన్‌లను రూ.5,000లోపే పొందొచ్చు. 5 వేలలోపు అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ పై ఓ లుక్కేయండి.

MI True Wireless Earphones 2

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో రూ.3999 విలువ చేసే ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2ను ఆఫర్ల కింద కేవలం రూ. 2,799కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో  చేసే చెల్లింపుతో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కు 5 శాతం మరియు నాన్–ప్రైమ్- మెంబర్స్కు 3 శాతం క్యాష్‌బ్యాక్  వస్తుంది. అంతేకాక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఇయర్ఫోన్స్ అవుటర్ ఇయర్ ఫిట్తో ఇయర్‌పీస్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇవి 14.2 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి 5.0, మరియు ఇయర్ బడ్స్ కేస్తో 14 గంటల బ్యాటరీని అందిస్తున్నాయి.

Bolt Audio Airbus Propads

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రూ.2,349 విలువ చేసే బౌల్ట్ ఆడియో ఎయిర్‌బాస్ ప్రోపాడ్స్ను ఆఫర్ కింద కేవలం రూ. 1,999కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో 10 శాతం అడిషనల్ డిస్కౌంట్ను పొందవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే యూఎస్బి టైస్ సి పోర్ట్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 24 గంటల బ్యాటరీని అందిస్తాయి. గూగుల్ అసిస్టెంట్ మరియు ఆపిల్ సిరికి అనుకూలంగా టచ్ కంట్రోల్‌కు సపోర్ట్ ఇస్తాయి.

Boat Aerodrops 281

అమెజాన్‌లో బోఅట్ ఎయిర్‌డోప్స్ 281 టిడబ్ల్యుఎస్ ఇయర్‌ఫోన్‌లు రూ.1,799లకే అందుబాటులో ఉన్నాయి. 10 మీటర్ల ఆపరేటింగ్ రేంజ్ ఉన్న ఈ ఇయర్ఫోన్స్ కనెక్టివిటీకి బ్లూటూత్ వ5 ఉపయోగపడుతుంది. ఇవి ఛార్జింగ్ కేసుతో 14 గంటల బ్యాటరీని అందిస్తాయి. ఇవి ఐపిఎక్స్5 రేటింగ్తో వాటర్ రెసిస్టెన్స్కు అనుకూలంగా ఉంటాయి.OnePlus Buds

అమెజాన్లో వన్‌ప్లస్ బడ్స్‌లను రూ. 4,990లకు కొనుగోలు చేయవచ్చు. అయితే, కస్టమర్లు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను లేదా హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో 10 శాతం ఎడిషనల్ డిస్కౌంట్ను పొందవచ్చు. ప్రైమ్ మరియు నాన్-ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపులకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. వన్‌ప్లస్ బడ్స్‌లో 13.4 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు, యుఎస్‌బి టైప్-సి పోర్ట్తో ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ నాయిస్ కాన్సలేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Oppo Enco W31

రూ. 3,499గా ఉన్న ఒప్పో ఎన్‌కో డబ్ల్యూ 31 టిడబ్ల్యుఎస్ ఇయర్‌ఫోన్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా రూ.2,999లకే లభిస్తాయి. కస్టమర్లు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో క్యాష్‌బ్యాక్ లేదా హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో 10 శాతం అడిషనల్ డిస్కౌంట్ను పొందవచ్చు. ఒప్పో ఇయర్‌ఫోన్లో బాస్ మోడ్ మరియు బ్యాలెన్స్‌డ్ మోడ్ అనే విభిన్న ఆడియో మోడ్‌లను కలిగి ఉంటాయి. 15 గంటల బ్యాటరీతో ఒప్పో ఛార్జింగ్ కేసును అందిస్తుంది.

Oppo Enco W51

ఒప్పో ఎన్కో డబ్ల్యూ 51 టిడబ్ల్యుఎస్ ఇయర్‌ఫోన్‌లు24 గంటల బ్యాటరీని అందిస్తాయి. అంతేకాక దీనిలో ఐపి 54 రేటింగ్తో వాటర్ రెసిస్టెన్స్ సౌకర్యం ఉంటుంది. అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపులకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంటుంది. రూ. 6,999గా ఉన్న ఈ ఇయర్ఫోన్స్ ఆఫర్ కింద హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ మరియు డెబిట్ కార్డు చెల్లింపుతో రూ.4,449లకే లభిస్తుంది. అమెజాన్ పే లేటర్ ద్వారా ఇయర్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తే రూ. 250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Zabra Elite 65T

ప్రీమియం జాబ్రా ఎలైట్ 65టి టిడబ్ల్యుఎస్ ఇయర్‌ఫోన్‌లకు అమెజాన్ లో భారీ తగ్గింపు లభిస్తోంది. రూ.13,999లుగా ఉన్న ఈ ఇయర్బడ్స్ ఆఫర్ కింద రూ. 4,999కే లభిస్తాయి. ఈ ఇయర్ఫోన్లను జాబ్రా సౌండ్ ప్లస్ యాప్తో కనెక్ట్ చేయవచ్చు. అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో నో-కాస్ట్ ఈఎంఐ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో 10 శాతం అడిషనల్ డిస్కౌంట్ లభిస్తుంది.

Crossbeats Pebble 2020

రూ.4,999గా ఉన్న క్రాస్‌బీట్స్ పెబుల్ టిడబ్ల్యుఎస్ ఇయర్‌ఫోన్‌లు అమెజాన్లో ఆఫర్ కింద రూ. 3,599లకే లభిస్తాయి. ఈ టిడబ్ల్యుఎస్ ఇయర్‌ఫోన్‌లు ఛార్జింగ్ కేసుతో 24 గంటల బ్యాటరీని అందిస్తాయి. ఇవి కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి5 కి సపోర్ట్ చేస్తాయి. దీనిలో వాయిస్ సపోర్ట్, టచ్ కంట్రోల్స్ మరియు పంచ్ బాస్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

JMLC 105 TWS

జేమీఎల్ సీ105టీడబ్ల్యూఎస్ ఇయర్ఫోన్లు క్రాస్‌బీట్స్ పెబుల్ మాదిరిగానే ఉంటాయి. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్‌లు ఛార్జింగ్ కేసుతో 17 గంటల బ్యాటరీని అందిస్తాయి. 5.8 ఎంఎం డైనమిక్ డ్రైవర్లతో వచ్చే ఈ ఇయర్బడ్స్ పంచ్ బాస్‌ను అందించగలవని కంపెనీ పేర్కొంది. రూ.7,999లుగా ఉన్న ఈ ఇయర్స్బడ్స్ అమెజాన్ సేల్లో భాగంగా రూ. 3,498లకే లభిస్తాయి.

skullcandy sesh evo

skullcandy sesh evo బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఛార్జింగ్ కేసుతో 24 గంటల బ్యాటరీని అందిస్తుంది. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ55 రేటింగ్, టచ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ. 4,999గా ఉన్న ఈ ఇయర్బడ్స్ను అమెజాన్లో ఆఫర్ కింద 3,000కే కొనుగోలు చేయవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :