Wednesday, October 7, 2020

Amazon Great india festival offers



Read also:

అక్టోబర్ 17 నుంచి అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగనుంది. దసరా, దీపావళి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సేల్ లో అనేక ఆఫర్స్ ప్రకటించింది అమెజాన్.


దసరా, దీపావళి ఫెస్టివల్ సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తున్నట్టు అమెజాన్ ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసింది. అయితే ఈ సేల్ ఎప్పట్నుంచి ఉంటుందన్న సస్పెన్స్ ఇన్నాళ్లూ కొనసాగింది. ఇప్పుడు డేట్స్ ప్రకటించింది అమెజాన్. అక్టోబర్ 17న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమవుతుందని లేటెస్ట్ గా ప్రకటించింది. ప్రైమ్ మెంబర్స్ కు ఈ సేల్ అక్టోబర్ 16న ప్రారంభం కానుంది. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఉంటుందని ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ ప్రారంభమైన ఓ రోజు తర్వాత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలు కానుంది. అయితే అమెజాన్ సేల్ ఎప్పుడు ముగుస్తుందో ఇంకా ప్రకటించలేదు. ఇక అమెజాన్ ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్ డీఎఫ్ సీ ఫెస్టీవ్ ట్రీట్స్ లో భాగంగా హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొన్నవారికి 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇక బజాజ్ ఫిన్ సర్వ్ కస్టమర్లు రూ.1,00,000 వరకు క్రెడిట్ లిమిట్ ఉపయోగించుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా వర్తిస్తాయి. అమెజాన్ పే యూజర్లు రోజూ రూ.500 వరకు షాపింగ్ రివార్డ్స్ పొందొచ్చు.

అమెజాన్ ఇటీవల లాంఛ్ చేసిన ఫైర్ టీవీ స్టిక్ లైట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో కొనొచ్చు. వన్ ప్లస్ 8టీ 5జీ అక్టోబర్ 14న లాంఛ్ కానుంది. ఈ సేల్ లోనే అందుబాటులోకి వస్తుంది. ఇక స్మార్ట్ ఫోన్లు కొనేవారికి ఈఎంఐ, రూ.13,500 వరకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్, రూ.49 నుంచి ప్రొటెక్షన్ ప్లాన్స్ పొందొచ్చు. ల్యాప్ టాప్స్ పై రూ.30,000 వరకు, హెడ్ ఫోన్స్ పై 70 శాతం వరకు, స్మార్ట్ వాచ్ లపై 70 శాతం వరకు, కెమెరా డివైజ్ లపై 60 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన ఇకో స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్ ప్లేలపై భారీ తగ్గింపు ఉంటుంది. మొబైల్ యాప్ లో షాపింగ్ చేసేవారికి ప్రతీ రోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గోల్డెన్ హవర్ డీల్స్ ఉంటాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్స్, రిఫ్రిజిరేటర్, ఫర్నీచర్, ఫ్యాషన్ వేర్ పై భారీ డిస్కౌంట్స్ ఉంటాయి. అయితే వేటిపై ఎంత తగ్గింపు ఉంటుందో ఇంకా ప్రకటించలేదు అమెజాన్. ఐఫోన్ 11 రూ.50,000 లోపే కొనొచ్చు. ఇటీవల రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఎం51, రెడ్ మీ నోట్ 9 ప్రో, రెడ్ మీ 9 ప్రైమ్, వన్ ప్లస్ నార్డ్ 5జీ, వన్ ప్లస్ 8 5జీ, రెడ్ మీ నోట్ 9, వన్ ప్లస్ 8 ప్రో 5జీ, సాంసంగ్ గెలాక్సీ ఎం31, సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ లాంటి స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్స్ ప్రకటించనుంది అమెజాన్.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :