Thursday, October 22, 2020

A DA along with a November salary



Read also:

  • నవంబరు జీతంతో పాటు ఒక డీఏ
  • ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం అన్న సజ్జల
  • ముఖ్యమంత్రి సూచన మేరకే సమావేశాలు
  • ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని గట్టిగా అడిగాం
  • కె ఆర్ సూర్యనారాయణ వెల్లడి

ఉద్యోగులకు అంత ఆశాజనకమైన సమాచారం ఏమీ లేదు. ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక్క  డీ ఏ మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా  ఉందని చెప్పింది.

నవంబరు నెల జీతంతో పాటు డిసెంబర్లో ఒక డీ ఏ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ ఉద్యోగులు న్యూస్’కు చెప్పారు. ముఖ్యమంత్రి సూచన మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘ నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. కె.ఆర్.సూర్యనారాయణతోను విడిగా మాట్లాడారు. ప్రధానంగా రాష్ర్ట ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని ఈ సమావేశంలో ఆయన నేతలకు వివరించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకే తాను ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు . వీటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సూర్యనారాయణ చెప్పారు. ఆయన డిమాండ్లు  ఇవి.
  • రెండు డీఏలు కచ్చితంగా ప్రకటించాల్సిందే
  • పీ ఆర్ సీ తక్షణమే అమలుచేయకపోతే ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది, వెంటనే అమలుకు ప్రయత్నించాలి
  • రిటైరైన ఉద్యోగుల బకాయిలు తక్షణమే అమలు చేయాలి
  • కోవిడ్ వల్ల నిలిపివేసిన సగం జీతాలు తక్షణమే ఇవ్వాలి
  • సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తక్షణమే అమలు చేయాలి.
  • ముఖ్యమంత్రి జగన్ తో తమ సంఘానికి విడిగా అపాయింట్ మెంట్ ఇప్పించాలని కూడా కె.ఆర్.సూర్యనారాయణ విన్నవించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :