Saturday, October 10, 2020

ఖాళీ కడుపుతో ఈ పండ్లు, కూరగాయలు తినకండి. ఏమవుతుందంటే



Read also:

వేళకు సరైన ఆహారం తింటారు. బ్యాచిలర్స్ విషయంలో సమస్యే. పొట్టలో ఏమీ లేనప్పుడు ఏ ఆహారం తినకూడదో తెలుసుకుందాం.

పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఐతే. వాటిని ఎప్పడుబడితే అప్పుడు తినకూడదు. వాటిలో షుగర్, కేలరీలు, యాసిడ్లు ఉంటాయి. ఖాళీ పొట్టతో వాటిని తింటే. రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఉదాహరణకు తియ్యటి పండ్లను ఖాళీ పొట్టతో తింటే. ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా పాంక్రియాస్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల పండ్లైతే. పొట్టలోకి వెళ్లాక. త్రేన్పులు వచ్చేలా చేస్తాయి. అల్సర్లకు దారితీస్తాయి. ఆ తర్వాత టాబ్లెట్లు వాడటం వల్ల సమస్య పరిష్కారమైనా. అది దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఖాళీ పొట్టతో ఏం తినకూడదో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉదయానే ఏమీ తినకుండా ఈ పండ్లను తినకండి.

Bananas : చాలా మంది ఉదయాన్నే వర్కవుట్ చేస్తూ. ఎనర్జీ కోసం అరటిపండ్లను తింటారు. ఫలితంగా వెంటనే ఎనర్జీ వస్తుంది కానీ. అవి రక్తంలో మెగ్నీషియంను పెంచేసి గుండెకు కీడు చెయ్యగలవు. అందువల్ల ఖాళీ పొట్ట ఉన్నప్పుడు అరటి తినకూడదు.

Citrus fruits like grape fruit : పుల్లటి పండ్లు అన్నింటిలోనూ గ్యాస్ ఉంటుంది. ద్రాక్ష, ఉసిరి, ఆరెంజ్ వంటివి. ఇవి పొట్టలోకి వెళ్లి గ్యాస్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. గుండె మంట కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏదైనా ఆహారం తిన్న తర్వాతే వీటిని తినాలి. అది కూడా కొద్దికొద్దిగానే.

Pear : పియర్ ఫ్రూట్‌లో ఫైబర్ ఉంటుంది. ఖాళీ పొట్టతో ఈ పండును తింటే. మ్యూకస్ మెంబ్రాన్స్ (మూత్రనాళం) దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Litchi : లిచి పండ్లు తినేటప్పుడు పెద్దగా తియ్యగా ఉన్నట్లు అనిపించవు. కానీ పొట్టలోకి వెళ్లాక మాత్రం షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచేస్తాయి. కడుపు నొప్పి వచ్చేలా కూడా చేస్తాయి.

Mango : మామిడిని ఉదయాన్నే తినకపోవడం మేలు. ఇందులో షుగర్ చాలా ఎకకువ ఉంటుంది. అందువల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరగడం, బాగా తగ్గడం లాంటి సమస్యలు తెస్తాయి.

Black dates : నల్లటి ఖర్జూరాల్లో పెక్టిన్, టాన్నిక్ అనే యాసిడ్లు ఉంటాయి. అవి గ్యాస్ట్రిక్ యాసిడ్‌తో కలుస్తాయి. పొట్టంతా ఉబ్బేలా చేస్తాయి. అందువల్ల ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినకూడదు. దీర్ఘ కాలికంగా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు వీటిని తినకూడదు.

Cucumber : దోసకాయల్లో అమైనో యాసిడ్లు ఎక్కువ. వీటిని ఖాళీ కడుపుతో తింటే. కడుపు నొప్పి వచ్చేలా, గుండె మంట కలిగేలా చేస్తాయి.

Tomato : టమాటాల్లో కూడా టాన్నిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టలో యాసీడీటీని పెంచుతుంది. దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ అల్సర్లకు కూడా కారణమవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :