Saturday, October 24, 2020

140 days



Read also:

 AP-స్కూలు @140 రోజులు-అకడమిక్ క్యాలెండర్ పై ఎస్ సీఈఆర్ టీ కసరత్తు

రాష్ట్రంలోని పాఠశాలలు నవంబరు 2 నుంచి తెరుచుకోనున్నాయి. ఈ నేపధ్యంలో 2020-21 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ రూపకల్పనపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) కసరత్తు చేస్తోంది. కొవిడ్ కారణంగా బడులు తెరవడం ఇప్పటికే దాదాపు నాలుగున్నర నెలలు ఆలస్యమైంది. అయినా విద్యార్థులు నష్టపోకుండా, జీరో ఇయర్ లేకుండా ప్ర త్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తోంది. వచ్చేనెల 2 నుంచి ఏప్రిల్ 30వరకు పాఠశాలలు నిర్వహించడం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో 140 పనిదినాలు మాత్రమే వస్తాయని అధికారులు తేల్చారు. దీనికోసం సంక్రాంతి, క్రిస్మస్ సెలవులను గణనీయంగా తగ్గించనున్నారు. గతంలో 10 రోజులున్న వీటిని 3 రోజులకు తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ దీనిపై పునరాలోచన చేస్తే 5 రోజుల వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి రెండో శనివారాలను కూడా పనిదినాలుగా మారుస్తున్నారు. ఇక, 1- 9వ తరగతి వరకు సిలబస్ ను తగ్గించకుండా కొన్ని పాఠాలను కుదించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తరగతిలో ఉపా ధ్యాయుడు బోధించాల్సిన పాఠాలు, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా, సొంతంగా నేర్చుకునే పాఠాలుగా మొత్తం సిలబస్ను విభజిస్తారు. గతంలో ఏటా 2 సమ్మేటివ్ అసెస్ మెంట్ ఎస్ఏ), 4 ఫార్మేటివ్ అనెస్ మెంట్( ఎఫ్ఏ) పరీక్షలను నిర్వహించేవారు. కానీ ఈ సంవత్సరం ఒక సమ్మేటివ్, 2 ఫార్మేటివ్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి మొదటి వారంలో ఎఫ్ఎ-1. మార్చిలో ఎఫ్-2, ఏప్రిల్ లో ఎస్ఏ పరీక్షను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇక పదో తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్ గానే తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈసారి టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 3/4 వారంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :