Sunday, September 27, 2020

Ysr pellikanuka full details



Read also:

వైఎస్ఆర్ పెళ్లి కానుక (YSR PELLI KANUKA)

ఉద్దేశ్యం : 

రాష్ట్రంలోని నిరుపేద  కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా, పెళ్లి కుమార్తె అయి అత్తరింటికి వెళ్లిన తర్వాత కూడా అభద్రత భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్ళికానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహము రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువు కి రక్షణ కల్పించడం వైయస్సార్ పెళ్లి కానుక రూపకల్పన ముఖ్య ఉద్దేశం.


పథకం యొక్క మార్గదర్శకాలు :

1. మండల సమాఖ్య/మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

2. అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.

3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లి కుమార్తె బ్యాంక్ ఖాతాలో వేస్తారు.

4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.

5. అనంతరం వివాహ దృవీకరణ పత్రం ఇస్తారు.

అర్హతలు :

1. వధువు మరియు వరుడు ఇద్దరు ప్రజాసాధికారిక సర్వే నందు నమోదు కాబడి ఉండాలి(వాలంటీర్ నందు HOUSEHOLD సర్వే చేసుకోవాలి.. దీనికి - మార్గ దర్శకాలు రావలసి ఉంది).

2. వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.

3. వధువు మరియు వరుడు ఇద్దరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

4. వధువు కచ్చితంగా తెల్ల రేషన్కార్డు కలిగి ఉండాలి.

5. వివాహ తేదీ నాటికి వధువుకు 18 సంవత్సరాలు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

6. కేవలం మొదటి సారి వివాహం చేసుకునేవారు మాత్రమే ఈ పథకం కు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పథకమునకు దరఖాస్తు చేసుకోవచ్చును.

7. వివాహము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరగవలెను.

ప్రోత్సహకం :

1. వైఎస్ఆర్ పెళ్లి కానుక (ఎస్సీ) సాంఘిక సంక్షేమ శాఖ-40,000/-

2. వైయస్సార్ పెళ్లి కానుక (ఎస్సీ కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ-75,000/-

3. వైయస్సార్ పెళ్లి కానుక (గిరిపుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ-50,000/-

4. వైయస్సార్ పెళ్లి కానుక (ఎస్టీ కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ-75,000/-

5. వైయస్సార్ పెళ్లి కానుక (బిసి) బీసీ సంక్షేమ శాఖ-35,000/-

6. వైయస్సార్ పెళ్లి కానుక (బి సి కులాంతర) బిసి సంక్షేమ శాఖ-50,000/-

7. వైయస్సార్ పెళ్లి కానుక (dulhan) మైనార్టీ సంక్షేమ శాఖ-50,000/-

8. వైయస్సార్ పెళ్లి కానుక (దివ్యాంగులు) దివ్యాంగుల సంక్షేమ శాఖ-1,00,000/-

9. వైఎస్ఆర్ పెళ్లి కానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ-20,000/-

కావలసిన డాక్యుమెంట్స్ :

1. కులము - కమ్యూనిటీ మరియు జనన దృవీకరణ పత్రము.

2. వయసు - ఎస్ఎస్సి సర్టిఫికెట్ 2004 వ సంవత్సరం మరియు ఆ తరువాత పదవ తరగతి పాస్ అయిన వారికి(లేదా) డేట్ ఆఫ్ బర్త్(లేదా) ఆధార్ కార్డ్.

3. ఆదాయము (వధువు కి మాత్రమే) - తెల్ల రేషన్ కార్డు/ఇన్కమ్ సర్టిఫికెట్.

4. నివాసం - ప్రజా సాధికారిక సర్వే నందు నమోదు/హౌస్ హోల్డ్ సర్వే.

5. అంగవైకల్యం - సదరం సర్టిఫికెట్ ( కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)

6. వితంతువు - ఆధార్ నెంబర్ ఆధారముగా ఫించన్ డేటాతో పరీసీలిస్తారు. వితంతువు అయ్యుండి పింఛన్ పొందకపోతే లేదా పింఛన్ డేటా లో వివరాలు లేకపోతే వ్యక్తిగత దృవీకరణ.

7. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు - ఎ.పి.బి.ఓ.సి.డబ్ల్యూ. డబ్ల్యూ.బి. చే జారీ చేయబడిన కార్మికుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డ్.

Pelli kanuka Website        Status checking

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :