Wednesday, September 30, 2020

YSR Jalakala eligibility criteria and process



Read also:

YSR Jalakala eligibility criteria and process

వైఎస్సార్ జలకళ కోసం రూ. 2340 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక వీటితో పాటు చిన్న, సన్నకారు రైతుల బోర్లకు మోటార్లు బిగించడానికి అదనంగా మరో రూ.1600 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపింది. అంటే మొత్తం రూ. 3940 కోట్లు ఖర్చు అవుతుంది అన్న మాట. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేయించే బోర్ల ద్వారా మరో 5 లక్షల ఎకరాలకు నీరు అందించ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది.అయితే బోరు బావుల సంఖ్యను పెంచడం సరైన నిర్ణయం కాదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల భూగర్భ జలాల లభ్యత తగ్గిపోతుందని అంటున్నారు. బోర్లు వేశాక కూడా వాటికి విద్యుత్ సరఫరా చేయడం అదనపు ఖర్చు అని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బోర్లు వేయించే ఖర్చుతో నీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తే రైతులకు ఎక్కువగా లబ్ధి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఉచిత బోర్లు అప్లై చేయడానికి కావలసిన అర్హతలు

  • ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకము మరియు బ్యాంకు పాస్ పుస్తకం.
  • 1B, అడంగల్ సచివాలయంలో తీసుకోవాలి.
  • మార్జినల్ సర్టిఫికెట్ సచివాలయం లో తీసుకోవాలి.
  • (ఇక్కడ మార్జినల్ సర్టిఫికెట్ అంటే మేము చిన్న రైతులు హా లేదా  పెద్ద రైతుల హా అని సర్టిఫికేట్ తీసుకోవాలి. సచివాలయంలో అప్లై చేస్తే సచివాలయం వాళ్ళు మార్జినల్ సర్టిఫికెట్ ఇస్తారు.
  • రైతు భరోసా పొందిన పట్టాదారు పాసు పుస్తకము ఉండాలి.  అయితే కొంచెం తొందరగా వర్క్ మూవ్ అవుతుంది.
  • ఇంతకుముందే బోరు ఉంటే వాళ్ళకి కొత్త బోరు వేయరు. వాళ్ళకి బోరు రాదు.notelgible
  • కొత్త బోరు కావాల్సిన వాళ్ళు పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాల ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో  కలవండి.

ఏపీ ప్రభుత్వం సోమవారం వైఎస్సార్ జలకళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోర్లు ఉచితంగా వేయిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మొత్తం 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ పథకం అమలు చేయనునుంది ప్రభుత్వం. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయించి ఇవ్వడంతో మోటార్లు కూడా బిగించనున్నారు. ఇక వైఎస్సార్ జలకళ ద్వారా బోరు వేయించుకోవడానికి ఎవరు అర్హులు అనే ప్రశ్న చాలా మంది రైతుల్లో వ్యక్తమవుతుంది.

కాగా రెండున్నర ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. మరి అంతకన్న తక్కువ భూమి ఉన్న రైతుల పరిస్థితి ఎలా అని అనుకుంటున్నారా?


YSR_Jalakala

వారు కూడా బోరు వేయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. తక్కువ భూమి ఉన్న వారు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి బోరు బావి తవ్వించుకోవచ్చు. బోరు బావి తవ్వించుకోవాలనుకునే వారు వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లోనూ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి బోరు విఫలమైనా రెండోసారి కూడా బోరు వేయించుకునే అవకాశం కూడా ఉంది.

Applying Process Step by step

  • దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే పేజి ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఆధార్ నెంబర్ ను ఇచ్చి సబ్మిట్ చేయాలి.
  • పైన చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది అందులో మీరు మీ యొక్క వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయగానే మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
  • మీరు ఆన్లైన్ లో అప్లై చేయలేకపోతే మీరు మీ గ్రామ సచివాలయం లో అప్లై చేసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :