Saturday, September 26, 2020

Who will live how long Scientists telling by genes



Read also:

Who will live how long Scientists telling by genes

మనం ఎంతకాలం బతుకుతామో ముందే తెలిస్తే అదో థ్రిల్. ఇన్నాళ్లూ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అత్యంత సైంటిఫిక్ పద్ధతుల్లో ఆయుష్షు లెక్క తేల్చేస్తున్నారు శాస్త్రవేత్తలు.


పుట్టుక, చదువు, పెళ్లి, సంతానం, పెద్దరికం. మరణం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి కామన్. వీటిలో కొన్ని మనం ఊహించగలం. కానీ మరణం ఎప్పుడొస్తుందో చెప్పలేం. అంతా ఆరోగ్యంగా ఉన్నవారు సైతం సడెన్‌గా చనిపోతుంటారు. ఎన్నో రోగాలతో ఉన్న వారు సైతం. జీవించగలుగుతారు. ఎందుకిలా అన్న దానిపై ఓ అధ్యయనం జరిగింది. దాని నుంచి విప్లవాత్మక ఫలితాలు వస్తున్నాయి. ఎవరు ఎంతకాలం బతకగలరో సైంటిఫిక్ పద్ధతుల్లో చెప్పేయగలుగుతున్నారు శాస్త్రవేత్తలు.

ఇంగ్లండ్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు. ఈ అధ్యయనం చేశారు. అది సైంటిఫిక్ అధ్యయనం కాదంటున్న శాస్త్రవేత్తలు. అధ్యయనాన్ని మాత్రం పూర్తిగా సైంటిఫిక్ పద్ధతుల్లోనే చేశామంటున్నారు. మనషుల DNAలోని జన్యువులు (జీన్స్). ఆధారంగా ఎవరు ఎంతకాలం బతకగలరో చెప్పగలం అంటున్నారు.

కుటుంబ జన్యువులను బట్టీ. ఎవరు ఎంతకాలం జీవించగలరో ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జన్యువులను బట్టీ. ఎవరికి త్వరగా ముసలితనం రాగలదో తేల్చేయవచ్చంటున్నారు. ఇది సాధ్యమే. ఎలాగంటే. డయాబెటిస్ లాంటి వ్యాధులు జన్యుపరంగా వారసత్వాలకు వస్తుంటాయి. ఈ అంచనా కరెక్ట్ అవుతోంది. ఇదే విధంగా. ఆయుర్దాయాన్ని కూడా లెక్క తేల్చగలుగుతున్నారు.

మన శరీరంలోని 12 రకాల జన్యువులు. మన ఆయుష్షును డిసైడ్ చేస్తున్నాయట. సింపుల్‌గా చెప్పాలంటే. ఓ కుటుంబానికి చెందిన తరాల ప్రజలు. సగటున ఎంత కాలం జీవిస్తున్నారు? వారికి ఎలాంటి వ్యాధులుంటున్నాయి, ఎన్ని వ్యాధులుంటున్నాయి అనే అంశాల్ని లెక్కలోకి తీసుకొని. ఆయుష్షు కాలాన్ని నిర్ణయిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :