Saturday, September 26, 2020

Voter Registration of Teacher MLC Constituencies from 1



Read also:

 


  • 1 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు
  • రెండు నియోజకవర్గాల్లో ముగియనున్న పదవీకాలం
  • రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది.
  • ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న రాము సూర్యారావు , కృష్ణా-గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న ఏ.ఎస్.రామకృష్ణ వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన రిటైర్ కానున్నారు. 
  • ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 
  • 2020 నవంబర్ 1 అర్హత తేది కాగా.. వచ్చే నెల 1వ తేదీ నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. అదే తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలను, మార్పులు చేర్పులను స్వీకరించనున్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 18వ తేదీన ప్రకటిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :