Tuesday, September 15, 2020

Short videos beta version available in few days in youtube



Read also:

యూట్యూబ్‌లో టిక్‌టాక్‌ తరహా షార్ట్ వీడియో ఫీచర్.మొదట భారత్‌లో లాంచ్


  • షార్ట్‌ వీడియో ఫార్మాట్‌లో 'షార్ట్స్‌' పేరిట త్వరలో విడుదల
  • భారత్‌లో ప్రయోగాత్మకంగా బీటా వర్షన్
  • మొబైల్ ఫోన్ల ద్వారా చిన్నపాటి  వీడియోలు తీసుకునే ఛాన్స్‌
  • టిక్‌టాక్ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నాలు

షార్ట్‌ వీడియో ఫార్మాట్‌లో 'షార్ట్స్‌' పేరిట భారత్‌లో కొత్త ఫీచర్‌ను ప్రారంభించడానికి యూట్యూబ్ సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో భారత్‌లో ప్రయోగాత్మకంగా బీటా వర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్ల ద్వారా చిన్నపాటి  వీడియోలు తీసుకుని పోస్ట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని యూట్యూబ్ తెలిపింది.

దీన్ని విడుదల చేసిన అనంతరం యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని, భవిష్యత్తులో ఇందులో మరిన్ని ఫీచర్లు కలుపుతామని, మరిన్ని దేశాల్లోనూ ఈ ఫీచర్‌ను విడుదల చేస్తామని యూట్యూబ్ పేర్కొంది. 15 సెకన్ల నిడివితో ఉండే క్రియేటివ్ వీడియోలను తీసుకుని తమను తాము యూజర్లు కొత్తగా పరిచయం చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపింది.

హాస్యం కోసం, కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం ప్రతి నెల రెండు బిలియన్ల మంది వ్యూయర్లు యూట్యూబ్‌ను ఓపెన్ చేస్తారని చెప్పింది. యూట్యూబ్‌ ద్వారా చాలా మంది తమ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపింది. మొబైల్‌ క్రియేటర్ల కోసం తాము ఈ సరికొత్త షార్స్ట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పింది.

కాగా, భారత్‌లో టిక్‌టాక్‌ యాప్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిజినెస్‌ను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే  పలు సంస్థలు పోటీపడుతూ షార్ట్‌ వీడియో ఫీచర్‌లను తీసుకొచ్చాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ పేరిట ఇప్పటికే షార్ట్ వీడియో ఫీచర్‌ను తీసుకొచ్చింది. అలాగే, దేశీయ సంస్థలు కూడా ఈ రేసులో పోటీపడుతున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :