Monday, September 21, 2020

SBI UPI Transfer failed fallow below actions



Read also:

 మీరు యూపీఐ ద్వారా ట్రాన్స‌్‌ఫర్ చేస్తే మీ అకౌంట్‌లో డెబిట్ అయినా అవతలివారి అకౌంట్‌లోకి డబ్బులు క్రెడిట్ కాలేదా? ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి.


మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? తరచూ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారా? యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుతూ ఉంటారా? ఎవరికైనా డబ్బులు పంపాలంటే యూపీఐని మించిన వేగవంతమైన ట్రాన్సాక్షన్ వేరే ఏదీ లేదు. ఒకవేళ మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే యోనో లైట్ ఎస్‌బీఐ యూపీఐ యాప్ ఉపయోగించండి. ఈ పద్ధతి ద్వారా వేగంగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఒక ట్రాన్సాక్షన్‌ ద్వారా రూ.10,000, రోజుకు రూ.25,000 వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, బిల్లులు చెల్లించడం కోసం యూపీఐ పేమెంట్ పద్ధతి ఉపయోగించడం ఇటీవల బాగా పెరిగింది. యూపీఐ ద్వారా డబ్బులు పంపడానికి బెనిఫీషియరీ వివరాలు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే లావాదేవీల కోసం ఎక్కువగా యూపీఐ పేమెంట్‌పై ఆధారపడుతున్నారు.

SBI UPI Transfer failed

అయితే మనీ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, యూపీఐ లావాదేవీలు జరిపినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం మామూలే. అందరు కస్టమర్లకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా అకౌంట్‌లో డబ్బులు డెబిట్ అవుతుంటాయి. ఇలాంటి సందర్భంలో కస్టమర్లు కంగారు పడటం మామూలే. డబ్బులు వెనక్కి వస్తాయా లేదా? ఎప్పుడు అకౌంట్‌లోకి వస్తాయి? అకౌంట్‌లోకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి? అన్న సందేహాలు ఉంటాయి. అయితే మీరు ఒకసారి పేమెంట్ ప్రారంభించిన తర్వాత క్యాన్సిల్ చేయడం సాధ్యం కాదు. నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా, సర్వర్ డౌన్ ఉన్నా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది


మీ యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు సాధారణంగా వెంటనే రియల్ టైమ్ రివర్సల్ ద్వారా డబ్బులు వెనక్కి వస్తాయి. కొన్ని గంటల్లోనే డబ్బులు అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. లేదా ఒకట్రెండు రోజులు సమయం పట్టొచ్చు. అయినా మీ డబ్బులు వెనక్కి రాకపోతే బ్యాంకుకు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ యోనో లైట్ యాప్‌ యూజర్లు యాప్‌లోనే కంప్లైంట్ చేయొచ్చు. పేమెంట్ హిస్టరీలోకి వెళ్లి raise dispute పైన క్లిక్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఆ తర్వాత మీ కంప్లైంట్ స్టేటస్‌ని Dispute Status సెక్షన్‌లో చెక్ చేయొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :