Saturday, September 26, 2020

SBI alert



Read also:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులకు బ్యాంకు పలు హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఎందుకో తెలుసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే వెంటనే అప్రమత్తం కావాలి. ఓ స్కామ్ ద్వారా మీ అకౌంట్లోని డబ్బుల్ని కాజేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. బ్యాంకు పంపించినట్టుగానే కస్టమర్లకు మోసగాళ్లు ఇమెయిల్స్ పంపి దోచుకుంటున్నట్టు ఎస్‌బీఐ గుర్తించింది. ఇలాంటి మోసాల గురించి వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో అప్రమత్తమైంది. ఈ మోసం జరుగుతున్న తీరుపై నిఘా పెట్టింది. మోసగాళ్లు ఎస్‌బీఐ పేరుతో కస్టమర్లకు ఇమెయిల్స్ పంపిస్తున్నారు.ఆ తర్వాత అకౌంట్ వివరాలు తెలుసుకుంటున్నారు. అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డు నెంబర్, క్రెడిట్ కార్డు నెంబర్, సీవీవీ, పిన్ లాంటివి తెలుసుకొని అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఆ ఇమెయిల్స్ క్లిక్ చేయకూడదని, బ్యాంకు అలాంటి ఇమెయిల్స్ పంపించదని ఎస్‌బీఐ ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చింది. ఆ ట్వీట్ ఇదే.

కస్టమర్లకు వస్తున్న ఇమెయిల్స్‌లోని వివరాలు చూస్తే ఆ మెయిల్ బ్యాంకు నుంచే వచ్చిందని నమ్మేస్తారు. అంత పక్కాగా వల వేస్తున్నారు మోసగాళ్లు. ఎట్టిపరిస్థితుల్లో కస్టమర్లు ఇమెయిల్‌లో తమ అకౌంట్ల వివరాలు వెల్లడించకూడదు. బ్యాంకు నుంచి సంప్రదిస్తున్నట్టు చెప్పినా నమ్మకూడదు. అవసరం అయితే బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. ఏవైనా వివరాలు అప్‌డేట్ చేయాలంటే బ్యాంకులో చేయాలి. లేదా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే చేయాలి. కస్టమర్లకు ఎక్కువగా ఫేక్ ఇమెయిల్స్ వస్తుండటంతో "Think Before You Click" పేరుతో ప్రచారం మొదలుపెట్టింది ఎస్బీఐ. కస్టమర్లకు ఈ మోసాలపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తోంది. తమ అధికారిక ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ https://www.onlinesbi.sbi/ ఇదేనని ట్వీట్‌లో స్పష్టం చేసింది ఎస్‌బీఐ. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :