Monday, September 21, 2020

Remember these thing while swipe your cards



Read also:

క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్. మీరు బయట ఎక్కడైనా కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త.


మీకు బయట షాపింగ్ చేసే అలవాటుందా? ఎక్కడ ఏం కొన్నా మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ స్వైప్ చేస్తుంటారా? అయితే జాగ్రత్త. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మోసాలు పెరిగిపోతున్నాయి. కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు.కార్డు హోల్డర్లను బోల్తా కొట్టించేస్తారు మోసగాళ్లు. అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంటాయి బ్యాంకులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లను అప్రమత్తం చేస్తూ కొన్ని సూచనలు జారీ చేసింది. షాపింగ్‌లో లేదా ఇంకెక్కడైనా మీ కార్డును స్వైప్ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో సూచిస్తోంది. మరి మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లావాదేవీల విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలా జాగ్రత్తగా ఉండాలి? తెలుసుకోండి.

మీరు ఏదైనా షాపులో, పెట్రోల్ బంకులో లేదా హోటల్‌లో బిల్ పేమెంట్ కోసం మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఇచ్చారా? అలర్ట్‌గా ఉండండి. ట్రాన్సాక్షన్ పూర్తవగానే మీ కార్డు వెనక్కి తీసుకోవడం మర్చిపోవద్దు. అవసరమైతే మీరే కార్డు స్వైప్ చేసి పిన్ ఎంటర్ చేయండి. ఎట్టిపరిస్థితుల్లో సీవీవీ, పిన్ ఎవరికీ చెప్పొద్దు. మీరు కార్డు ఇచ్చిన దగ్గర్నుంచి మళ్లీ కార్డు మీ చేతికి వచ్చే వరకు మీ కళ్లన్నీ కార్డుపైనే ఉండాలి. మీ కార్డును స్వైపింగ్ మెషీన్‌లో కాకుండా ఇంకా ఎక్కడైనా స్వైప్ చేస్తున్నారేమో చూడండి. మీకు తెలియకుండా మీ కార్డు వివరాలు నోట్ చేసుకుంటున్నారేమో గమనించండి

ట్రాన్సాక్షన్ పూర్తైన తర్వాత రిసిప్ట్ తీసుకొని భద్రపర్చుకోండి. అందులో వివరాలు చూసుకోండి. మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చే వివరాలనూ చెక్ చేయండి. మీరు ఎంత చెల్లించారో అంతే మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిందా లేదా అంతకన్నా ఎక్కువ చెల్లించారా అన్నది చూడండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే రిసిప్ట్ పారెయ్యొచ్చు. ఎస్ఎంఎస్ డిలిట్ చేయొచ్చు. ఏమాత్రం తేడా ఉన్నా అప్రమత్తం కావొచ్చు. మీ ప్రమేయం లేకుండా ఏవైనా లావాదేవీలు జరిగినట్టైతే వెంటనే బ్యాంకుకు కంప్లైంట్ చేయండి. అవసరమైతే https://cybercrime.gov.in/ పోర్టల్‌లో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :