Saturday, September 26, 2020

PM SVANidhi Scheme apply process



Read also:

PM SVANidhi Scheme-మోదీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఇస్తున్న రూ.10,000 రుణాలకు మీరు అప్లై చేయాలనుకుంటున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అవండి.

చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పేరుతో మైక్రో క్రెడిట్ స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు తిరిగి ప్రారంభించేలా చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది మోదీ ప్రభుత్వం. 2020 జూలై 2న ఈ పథకం ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఈ పథకం ముఖ్యంగా చిరు వ్యాపారుల, వీధుల్లో చిన్నచిన్న షాపులు నిర్వహించేవారి కోసం ప్రకటించినదే. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 15,96,089 దరఖాస్తులు వచ్చాయి. 5,87,241 మందికి రుణాలు మంజూరయ్యాయి. అంటే రూ.587 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. వారిలో 1,63,239 దరఖాస్తు దారులకు రుణాలు క్రెడిట్ అయ్యాయి. అంటే రూ.163 కోట్లు దరఖాస్తుదారుల అకౌంట్లో క్రెడిట్ చేసింది మోదీ ప్రభుత్వం. పీఎం స్వనిధి పోర్టల్‌లో ఈ రియల్‌టైమ్ డేటాను చూడొచ్చు. ఎక్కువ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి. సుమారు 5 లక్షల దరఖాస్తుల్ని పరిశీలించి రుణాలను మంజూరు చేశాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. టాప్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉండగా ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నాయి. మరి మీరు కూడా ఈ పథకాని ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.


PM SVANidhi Scheme: అప్లై చేయండి ఇలా

Step-1: ముందుగా http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step-2: చిరు వ్యాపారుల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత I am not a robot పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Request OTP బటన్ పైన క్లిక్ చేయాలి.

Step-3: మొబైల్ నెంబర్‌కు వచ్చిన 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Verify OTP పైన క్లిక్ చేయాలి. ఓటీపీ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయిన తర్వాత రెండో కేటగిరీ ఉంటుంది.Step- 4: కేటగిరీ సెలెక్ట్ సుకోవాలి.

Step-5: స్ట్రీట్ వెండర్ కేటగిరీ ఏ సెలెక్ట్ చేస్తే SRN ఎంటర్ చేయాలి. SRN లేకపోతే Don’t have SRN? Find here పైన క్లిక్ చేయాలి.

Step-6: SRN కోసం రాష్ట్రం సెలెక్ట్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి.

Step-7: SRN నెంబర్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. కాపీ చేసుకోవాలి.

Step-8: ముందు ట్యాబ్‌లో SRN నెంబర్ ఎంటర్ చేసి Search పైన క్లిక్ చేయాలి.

Step-9: SRN నెంబర్‌తో పాటు స్ట్రీట్ వెండర్ వివరాలు కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసుకొని కన్ఫామ్ చేయాలి.

Step-10: ఐడీ కార్డ్, సర్టిఫికెట్ ఆఫ్ వెండింగ్ అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత Next బటన్ పైన క్లిక్ చేయాలి. లోన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

Step-11: స్ట్రీట్ వెండర్ కేటగిరీ బీ సెలెక్ట్ చేస్తే SRN నెంబర్ సెలెక్ట్ చేయాలి. SRN ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ SRN నెంబర్ తెలియకపోతే పైన వెల్లడించిన 5 నుంచి 7 స్టెప్స్ ఫాలో కావాలి.

Step-12: SRN నెంబర్‌తో పాటు స్ట్రీట్ వెండర్ వివరాలు కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసుకొని కన్ఫామ్ చేయాలి. ఆ తర్వాత Next బటన్ పైన క్లిక్ చేయాలి. లోన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

Step-13: ఒకవేళ కేటగిరీ సీ లేదా డీ ఎంచుకుంటే లెటర్ ఆఫ్ రికమండేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

Step- 14A(i): లెటర్ ఆఫ్ రికమండేషన్ ఉంటే I have been issue Letter of Recommendation (LoR) by ULB/TVC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step- 14A(ii) : లెటర్ ఆఫ్ రికమండేషన్ అప్‌లోడ్ చేసి Next పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత లోన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

14B (i): ఒకవేళ లెటర్ ఆఫ్ రికమండేషన్ లేకపోతే I have NOT been issue Letter of Recommendation (LoR) by ULB/TVC పైన క్లిక్ చేయాలి.

Step-14B(ii): ఆ తర్వాత అందులో ఆప్షన్స్ సెలెక్ట్ చేసి Next పైన క్లిక్ చేయాలి. లోన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

Step- 15: ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి I am not Robot పైన క్లిక్ చేసి Verify పైన క్లిక్ చేయాలి.

Step- 16: ఆధార్ నెంబర్‌కు లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.

Step- 17: స్ట్రీట్ వెండర్ సర్వే ఫార్మాట్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత డిజిటల్ పేమెంట్ వివరాలు ఎంటర్ చేయాలి. ఈ వివరాలు లేకపోతే No పైన క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.

Step- 18: ఈ స్టెప్‌లో బ్యాంక్, బ్రాంచ్ సెలెక్ట్ చేయాలి. సేవ్ చేసి సబ్మిట్ చేయాలి.

Step -19: ఫోన్‌కు అప్లికేషన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం దాచుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :