Wednesday, September 23, 2020

Now get the money from deposit machines also-SBI



Read also:

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలో డబ్బులు లేవా? ఎస్‌బీఐ ఏటీఎంలు ఎప్పుడూ రద్దీగా ఉంటున్నాయా? మీరు ఇక ఆ ఏటీఎంలను మర్చిపోండి. ఎస్‌బీఐ ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్-ADWM లో మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కస్టమర్లు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు క్యూలో నిలబడకుండా ఈ మెషీన్లు ఉపయోగించి క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలని కోరుతోంది ఎస్‌బీఐ. ఇందులో డబ్బులు డ్రా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఏటీఎంలో డ్రా చేసినంత సింపుల్. కార్డు స్వైప్ చేయాలి. పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంతే. డబ్బులు డ్రా చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 13,000 పైగా ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్లు ఉన్నాయి.


వీటిలో డబ్బులు మాత్రమే డిపాజిట్ చేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బులు కూడా డ్రా చేయొచ్చన్న విషయం తెలియదు. మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ మెషీన్‌లో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. ఏటీఎంకు వెళ్లకుండా ఇదే మెషీన్‌లో క్యాష్ డ్రా చేయొచ్చు. ఎలాగో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.

మీకు దగ్గర్లో ఎస్‌బీఐ ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్-ADWM ఎక్కడుందో తెలుసుకోండి. అక్కడికి వెళ్లిన తర్వాత మీ దగ్గరున్న ఏటీఎం కార్డును స్వైప్ చేయండి. అందులో బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీకు కావాల్సిన భాషను ఎంచుకోండి. ఆ తర్వాత నెక్స్‌ట్ బటన్ క్లిక్ చేయండి. మీ ఏటీఎం పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో Cash Withdrawal ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీకు ఎంత డబ్బు కావాలో ఎంటర్ చేయండి. మెషీన్‌లోని షట్టర్ ద్వారా క్యాష్ వస్తుంది. మీరు రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఏటీఎం పిన్‌తో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. గతంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఈ సెక్యూరిటీ ఫీచర్ ఉండేది. సెప్టెంబర్ 18 నుంచి 24 గంటలు ఓటీపీ రూల్ అమలు చేస్తోంది ఎస్‌బీఐ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :