Thursday, September 24, 2020

Mi power bank at 899



Read also:

Mi Power Bank 3i:రూ.899కే శక్తివంతమైన ఎంఐ పవర్ బ్యాంక్

3i పవర్ బ్యాంకుల్లో 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ హార్డ్‌వేర్ ఉంటుంది. వీటిలో ఉండే లిథియం పాలిమర్ బ్యాటరీలు లిథియం అయాన్ బ్యాటరీలకంటే సురక్షితమైనవి.

MI_Power_banks

భారత్‌లో పవర్ బ్యాంక్స్ విభాగంలో టాప్ ప్లేస్‌కు వెళ్లడమే లక్ష్యంగా ఎమ్ఐ కంపెనీ పనిచేస్తోంది. తాజాగా 10,000 ఎంఏహెచ్, 20,000 ఎమ్ఏహెచ్ సామర్థ్యాలతో Mi-3i పవర్ బ్యాంక్‌లను ఆ సంస్థ విడుదల చేసింది. వీటిని టైప్-సి యూస్బీ, మైక్రో-యూఎస్బీలతో ఛార్జింగ్ చేయొచ్చు. ఈ రెండు మోడళ్లకూ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం ఉంది. అధునాతన 12-లేయర్ సర్క్యూట్ రక్షణతో పాటు స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ ఫీచర్లు వీటికి అదనపు ఆకర్షణ. Mi-3i పవర్ బ్యాంక్ల ఫీచర్ల గురించి షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ట్విట్టర్ ద్వారా వివరించారు.

ధర ఎంత?

10,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన Mi-3i పవర్ బ్యాంక్ ధర రూ.899. Mi వెబ్సైట్, అమెజాన్లలో ఇవి లభ్యమవుతాయి. ఈ మోడల్ రెండు రంగులు.. బ్లాక్, బ్లూ కలర్లలో లభిస్తుంది. 20,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్ ధర రూ.1,499. ఇది బ్లాక్ కలర్లోనే లభిస్తుంది. దీన్ని కూడా అమెజాన్, ఎమ్ఐ వెబ్‌సైట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

3i ఫీచర్లు

Mi-3i పవర్ బ్యాంక్లకు డ్యూయల్ ఇన్పుట్ పోర్టులు ఉన్నాయి. మైక్రో యూఎస్బీ, టైప్-సి యూఎస్బీలతో వీటిని ఛార్జ్ చేయొచ్చు. టైప్-సి కేబుల్తో వస్తున్న ఫోన్లకు సరిపోయేలా రెండు ఫీచర్లను అభివృద్ధి చేశారు. రెండు పవర్ బ్యాంకులూ 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ను అందిస్తున్నాయి. 20,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్లో మూడు అవుట్పుట్ పోర్టులు ఉండగా, 10,000 ఎమ్ఏహెచ్ రెండు అవుట్పుట్ పోర్టులను అందిస్తుంది.

టూ- వే మోడ్లో వాడుకోవచ్చు

యూజర్లు టూ- వే ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా ఈ మోడళ్లలో పొందుతారు. ఒకేసారి ఇన్‌పుట్ పోర్టు ద్వారా పవర్ బ్యాంకును ఛార్జ్ చేస్తూనే, అవుట్‌పుట్ పోర్ట్ ద్వారా డివైజ్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అల్యూమినియం అల్లాయ్ కేస్ వీటి పనితీరుకు అదనపు బలాన్నిస్తాయి. ఎర్గోనామిక్ ఆర్క్ డిజైన్, యానోడైజ్డ్ ఫినిషింగ్.. పవర్ బ్యాంకులకు తుప్పు పట్టకుండా నిరోధిస్తాయి.* లో- పవర్ మోడ్‌లోనూ ఉపయోగించవచ్చు

3i పవర్ బ్యాంకుల్లో 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ హార్డ్‌వేర్ ఉంటుంది. వీటిలో ఉండే లిథియం పాలిమర్ బ్యాటరీలు లిథియం అయాన్ బ్యాటరీలకంటే సురక్షితమైనవి. వాటి సామర్థ్యం కూడా ఎక్కువే. డబుల్ ట్యాపింగ్ ద్వారా లో-పవర్ ఆప్షన్ను కూడా ఎంచుకోవచ్చు. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, ఫిట్నెస్ బ్యాండ్లు వంటి వాటిని ఛార్జ్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి నాలుగు గంటలు పడుతుంది. 20,000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంకును ఏడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

పాత పవర్ బ్యాంక్‌ల ధరలు తగ్గాయి

షియోమి ఫిబ్రవరిలో విడుదల చేసిన 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ధరను కూడా తగ్గించింది. మొదట్లో దీని ధర రూ.1,499 కాగా, ఇప్పుడు రూ.1,399కే అందిస్తుంది. ఇది కూడా ఎమ్ఐ స్టోర్, అమెజాన్‌లో లభ్యమవుతుంది. ఇది డ్యుయల్ యూఎస్బీ టైప్-ఎ ఇన్పుట్ పోర్టులు, మైక్రో-యూఎస్బీ అవుట్పుట్ పోర్ట్, టైప్-సి అవుట్పుట్ పోర్టును కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్, 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ హార్డ్‌వేర్, లిథియం పాలిమర్ బ్యాటరీలు.. వంటి ఫీచర్లు ఈ పవర్ బ్యాంక్‌లో ఉన్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :