Saturday, September 26, 2020

Last letter from sp balu garu



Read also:

ఎస్పీ బాలు గారు రాసిన ఆ లేఖ వైరల్

40 వేలకు పైగా పాటలు పాడి.. భారత సినీ పరిశ్రమపై చెరగని ముద్రవేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూతతో సినీ ఇండస్ర్టీ ఉలిక్కిపడింది.సినీ గాయకుడిగా ఆయన ఎన్నో అద్భుతాలను సృష్టిచిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం.నెల్లూరు జిల్లా కోనేటమ్మకోటలో 1946 జూన్ 4న జన్మించారు. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాకోసం తొలిసారి గాత్రదానం చేసిన ఆయన.. ఘంటసాల వారసత్వాన్ని అంది పుచ్చుకుని.ఈన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 17 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. అత్యధిక పాటలు పాడిన ఏకైక గాయకుడిగా రికార్డుకు కూడా ఎక్కారు.

Last letter from sp balu sir

అయితే, బాలు కన్నుమూసిన తర్వాత. ఆయన గతంలో రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.స్వహస్తాలతో బాలుయే ఆ లేఖను రాశారు. అందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ.. నవంబర్‌ 30న మీ కార్యక్రమానికి తప్పక రాగలను.కొన్నిచిన్న చిన్నఅభ్యర్థనలను మీరు మన్నించాలని కోరారు.అందులో ముఖ్యంగా.నా పేరు ముందు డాక్టర్, పద్మభూషణ్‌, గానగంధర్వ వంటి విశేషణలు వేయకండి.. మనకు ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రయాణ వివరాలను తర్వాత చెప్పగలను.అంటూ లేఖను ముగించారు. బాలు కన్నుమూసిన విషయాన్ని జీర్ణించుకోలేక ఓవైపు ప్రముఖులంతా సంతాపాలు తెలియజేస్తున్న సమయంలో. ఆయన ఎప్పుడో రాసిన ఓ లేఖ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :