Wednesday, September 23, 2020

Know your PF balance in telugu



Read also:

మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఒక్క ఎస్ఎంఎస్‌తో తెలుసుకోవచ్చు. తెలుగులో కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి తమ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

సబ్‌స్క్రైబర్లు తమ బ్యాలెన్స్‌ను సులువుగా తెలుసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO.

ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో 'షార్ట్ కోడ్ ఎస్ఎంఎస్ సర్వీస్' ఒకటి.

ఈ సర్వీస్ ద్వారా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు తమ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ లేదా యూఏఎన్‌కు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేస్తే చాలు.

7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే పీఎఫ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది.

రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెసేజ్ చేస్తేనే బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.

ఈ ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా ఏ భాషలో అయినా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మొత్తం 10 భాషల్ని సపోర్ట్ చేస్తుంది.

ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ భాషల్లో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.అయితే ఏ భాషలో కావాలంటే ఆ భాషకు సంబంధించిన కోడ్ టైప్ చేసి మెసేజ్ చేయాలి.

ఉదాహరణకు తెలుగులో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. యూజర్లకు తెలుగులో ఎస్ఎంఎస్ వస్తుంది. వివరాల్లో లేటెస్ట్ పీఎఫ్ కంట్రిబ్యూషన్, బ్యాలెన్స్ లాంటి వివరాలు ఉంటాయి.

ఇంగ్లీష్ డిఫాల్ట్ భాషగా ఉంటుంది. EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే ఇంగ్లీష్‌లో మెసేజ్ వస్తుంది.

తెలుగు-TEL, హిందీ-HIN, కన్నడ-KAN, తమిళ్-TAM, మళయాళం-MAL, మరాఠీ-MAR, గుజరాతీ-GUJ, పంజాబీ-PUN, బెంగాలీ-BEN అని వేర్వేరు భాషలకు వేర్వేరు కోడ్స్ ఉంటాయి. ఏ భాషలో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఆ భాష కోడ్ టైప్ చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :