Tuesday, September 22, 2020

How to modify details in EPFO account



Read also:

 EPFO KYC: ఈపీఎఫ్ అకౌంట్‌లో తప్పులున్నాయా ఆన్‌లైన్‌లో సరిచేయండిలా

మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌లో తప్పులు ఉన్నాయా? ఈపీఎఫ్ ఆఫీసుకి వెళ్లకుండా ఆన్‌లైన్‌లో సరిచేసుకోండి ఇలా.

1.మీ అకౌంట్‌లోని వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయా? ఈపీఎఫ్ అకౌంట్‌లోని వివరాల్లో తప్పులు ఉంటే అనేక సమస్యలు వస్తాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ రిజెక్ట్ కావడానికి ప్రధాన కారణం ఈపీఎఫ్ అకౌంట్‌లోని వివరాల్లో తప్పులు ఉండటమే. 

2.మొదట్లో ఈ తప్పుల గురించి ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఈ తప్పుల గురించి తెలుస్తూ ఉంటుంది. దీంతో అప్పటికప్పుడు వివరాలు అప్‌డేట్ చేస్తుంటారు.

3.ఇటీవల కరోనా వైరస్ సంక్షోభ కాలంలో లక్షలాది మంది పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారు. అంతేకాదు.తమ అకౌంట్లలో వివరాలను కూడా అప్‌డేట్ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

4.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO జూలై నెలలోనే 2.39 లక్షల ఆధార్ నెంబర్లు, 4.28 లక్షల మొబైల్ నెంబర్లు, 5.26 లక్షల బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసిందని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.

5. మీరు కూడా మీ ఈపీఎఫ్ అకౌంట్‌లోని వివరాలు ఓసారి సరిచూసుకొని అప్‌డేట్ చేయడం మంచిది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఆన్‌లైన్‌లోనే తమ వివరాలను అప్‌డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ.

6.డాక్యుమెంట్స్‌ని కూడా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయొచ్చు.https://unifiedportal-mem.epfindia.gov.in/ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌డేట్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి. ఆ తర్వాత Manage సెక్షన్‌లో KYC ఆప్షన్ ఎంచుకోవాలి.

7. మీరు అప్‌డేట్ చేయాల్సిన వివరాలను సెలెక్ట్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, బ్యాంక్ వివరాలన్నీ అప్‌డేట్ చేయొచ్చు. మీరు అప్‌డేట్ చేయాలనుకునే డాక్యుమెంట్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి.

8. బ్యాంకు అకౌంట్ వివరాలైతే ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి. చివరగా Save బటన్ క్లిక్ చేయాలి. ఈపీఎఫ్ఓ అధికారులు మీ వెరిఫై చేసిన తర్వాత వివరాలు అప్‌డేట్ అవుతాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :