Tuesday, September 22, 2020

How to check your aadhar card is valid or not



Read also:

 How to check your aadhar card is valid or not

ఆధార్ కార్డు.భారతదేశంలో నివాసం లేకుండైన ఉండొచ్చు కానీ.. ఈ కార్డు లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ప్రభుత్వ సదుపాయాలు ఏది అందుకోవాలన్నా ఈ గుర్తింపు కార్డు ఉండాల్సిందే. భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్య పత్రాల్లో ఆధార్ కార్డు కూడా చాలా ముఖ్యమైంది. వ్యక్తిగత గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా అడ్రెస్ ప్రూఫ్ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ ఎన్ రోల్ కేంద్రాల్లో దరఖాస్తు చూసుకోవాలి లేదా ఆన్ లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ కు సంబంధించి ఆన్ లైన్ సేవల కోసం మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.

ఎందుకంటే ఆధార్ కార్డు అసలైందా లేదా నకిలీదా కాదా అని తెలుసుకునేందుకు ఇది చాలా ముఖ్యం.

ఆధార్ వెరిఫై సర్వీసెస్ లో అసలైందా కాదా అని చెక్ చేసుకోవచ్చు. కార్మికులు తమ గుర్తింపును ధృవీకరించడానికి నివాసితులు కూడా ఈ సేవను ఉపయోగిస్తున్నారని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. మీరు ఈ చిరునామా, మొబైల్ నంబర్ ను ఆధార్ వివరాల నవీకరణ సమయంలో మీరు ధృవీకరించవచ్చు. ఆధార్ ఆన్ లైన్ సేవలను పొందడానికి రిజిస్టర్ మొబైల్ నంబర్ అవసరం. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ ను ఆధార్ కు రిజిస్టర్ చేసుకోకపోయినట్లయితే సమీప పర్మినెంట్ ఆధార్ అడ్రెస్(పీఏసీ)ని సందర్శించండి. ఆధార్ కార్డు ఫేక్ కాదా అని తెలుసుకోవడమెలా.
aadhar_check
  • యూఐఢీఏఐ అఫిషియల్ సైట్ అయిన https://resident.uidai.gov.in/offlineaadhaar లో సందర్శించాలి.
  • తెరపై మీ ఆధార్ నెంబర్ లేదా వీఐడీతో పాటు సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి.
  • అనంతరం సెండ్ ఓటీపీ లేదా ఎంటర్ టీఓటీపీ ఆప్షన్ ను క్లిక్ చేయాలి
  • ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు సెండ్ చేయబడుతుంది.-మీ ఆధార్ నెంబర్ కరెక్ట్ అయినట్లయితే కొత్త పేజి తెరుచుకుంటుంది. అందులో ఆధార్ నెంబర్ సందేశాన్ని పొందుతారు.
  • ఇందులో మీ పేరు, రాష్ట్రం, వయసు, లింగం తదితర వివరాలు కనిపిస్తాయి.
  • ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డు సరైందా కాదా అని తెలుసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :