Monday, September 28, 2020

He took the ordinary stone. He was surprised to know that it was a diamond



Read also:

He took the ordinary stone. He was surprised to know that it was a diamond

మనం అదృష్టవంతులు అంటుంటామే. అతను అదే. ఓ పార్కులో పడివున్న రాయిని సరదాగా తీసుకెళ్తే. అది వజ్రమని తెలిసింది. పూర్తి విశేషాల్ని తెలుసుకుందాం.

మన పల్లెల్లో వజ్రాలు దొరుకుతున్నాయని. అప్పుడప్పుడూ ప్రజలు పొలాల్లో వెతుకుతుంటారు. అది మంచి పనే. ఎందుకంటే. ఏ రాయిలో ఏ వజ్రముందో ఎవరికి తెలుసు. ఓ బ్యాంక్ మేనేజర్. సరదాగా ఓ పార్కులో నడుస్తూ వెళ్లాడు. దారిలో ఓ రాయి కనిపించింది. మెరుస్తున్న ఆ రాయి అతన్ని ఆకర్షించింది. భలే ఉందే. అని చేతిలోకి తీసుకొని. అలా అలా ఎగరేస్తూ. క్యాచ్ పట్టుకుంటూ. అలా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ రాయి ఓ డైమండ్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు.



ఈ ఘటన జరిగింది అమెరికాలోని డైమండ్స్ స్టేట్ పార్కులో. నిజానికి ఆ పార్కులో ఇది వరకు వజ్రాలు దొరికేవి. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు దొరకట్లేదు. బ్యాంక్ మేనేజర్ కెవిన్ కిన్రాడ్‌కి దొరికినంత పెద్ద వజ్రం ఇదివరకు ఎప్పుడూ ఆ పార్కులో ఎవరికీ దొరకలేదు. 46 ఏళ్లలో ఎప్పుడూ అలా జరగలేదు. అందుకే అతన్ని అదృష్టవంతుడు అంటున్నారు.

కొన్ని రోజుల కిందట. పార్క్ ఉన్న ఏరియాలో. లారా తుఫాను వచ్చింది. దాంతో. పార్కులో అన్నీ కదిలిపోయాయి. ఎక్కడెక్కడి చిన్న చిన్న రాళ్లు చెల్లా చెదురయ్యాయి. ఆ తర్వాత పార్కుకి. కెవిన్. తన ఫ్రెండుతో కలిసి వచ్చాడు. అప్పుడే ఈ రాయి లాంటి వజ్రం కనిపించింది.

తనకు కనిపించిన చిన్న రాయిని. మొదట ఏదో గ్లాస్‌తో తయారైన రాయి అనుకున్నాడు కెవిన్. ఐతే. ఈ రాయి దొరికిన విషయం. పార్కుకి చెందిన డైమండ్ చెకింగ్ సెంటర్‌కి తెలిసింది. వాళ్లు. ఆ రాయిని పరిశీలిస్తామన్నారు. మొదట కెవిన్ అవసరం లేదన్నాడు. అదో మామూలు రాయి అన్నాడు. వాళ్లు మాత్రం ఒప్పుకోలేదు. చెక్ చేశారు. అంతే. అది వజ్రం అని తేల్చారు.

మొత్తం 9.07 కేరట్ల డైమండ్ అది. అది అంత మేలు జాతి వజ్రమేమీ కాదు. అందువల్ల దాని విలువ దాదాపు రూ.5 లక్షల దాకా ఉంటుందంటున్నారు. తుఫాను వచ్చిన తర్వాతి రోజు ఎండ రావడంతో. వజ్రాలు మెరుస్తున్నాయనీ. అందువల్ల అది కెవిన్‌కి కనిపించిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ఆ పార్కులో 246 వజ్రాలు దొరికాయి. కెవిన్‌కి వజ్రం దొరికిందని తెలియగానే. ఇప్పుడా పార్కులో జనం తెగ వెతుకుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :