Tuesday, September 29, 2020

Google meet new updates



Read also:

Google meet new updates

గూగుల్ రూపొందించిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ గూగుల్ మీట్ మరో కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేసింది. కాల్ మాట్లాడేటప్పడు శబ్దాలను ఫిల్టర్ చేసి, నాయిస్ ను తగ్గించి, సౌండ్ క్వాలిటీని పెంచగల సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది

గూగుల్ రూపొందించిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ గూగుల్ మీట్ మరో కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేసింది. కాల్ మాట్లాడేటప్పడు శబ్దాలను ఫిల్టర్ చేసి, నాయిస్ ను తగ్గించి, సౌండ్ క్వాలిటీని పెంచగల సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్లలో విడుదల చేసింది. ఇవే కాకుండా పాఠశాలలకు, విద్యార్థులకు అవసరమయ్యే మరిన్ని అంశాలపై గూగుల్ దృష్టి సారించింది. గూగుల్ మీట్లో పాఠాలు వినే విద్యార్థుల కోసం అటెండెన్స్ రిపోర్ట్ ఫీచర్ను అభివృద్ధి చేయనుంది.
నాయిస్ వినిపించదు
ఇంతకుముందే బ్యాక్గ్రౌండ్లో యాప్ను బ్లర్ చేసుకునే ఆప్షన్ను గూగుల్ విడుదల చేసింది. తాజాగా నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ను వినియోగదారుల కోసం అభివృద్ధి చేసింది. ఇప్పుడు వినియోగదారులు బిజీగా ఉండే రోడ్ల పక్కన, హోటళ్ల వద్ద కూడా ఈ ఫీచర్ సాయంతో అంతరాయం లేకుండా కాల్ చేసుకోవచ్చు. కీబోర్డ్ టైపింగ్, తలుపులు తెరవడం, మూసివేయడం వంటివి చేసినప్పుడు వచ్చే శబ్దాలను, కిటికీ నుంచి వచ్చే నాయిస్ను ఈ ఫీచర్ నిరోధిస్తుంది. సౌండ్ను ఫిల్టర్ చేయడం ద్వారా అవతలి వారితో అంతరాయం లేకుండా మాట్లాడుకోవచ్చు. కాల్ మాట్లాడేటప్పుడు వాయిస్ నుంచి అనవసర శబ్దాలను వేరుచేసేందుకు గూగుల్ ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను రూపొందించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి కొంతమందికే
ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉండదని గూగుల్ తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను 9to5 వెబ్సైట్ ప్రకటించింది. ప్రస్తుతం జీ సూట్ ఎంటర్ప్రైజ్, జీ సూట్ ఎంటర్ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ కస్టమర్లకే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అప్డేట్ లభిస్తుంది. జీ సూట్ బేసిక్, జీ సూట్ బిజినెస్, జీ సూట్ ఫర్ నాన్ ప్రాఫిట్ అకౌంట్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.
అటెడెన్స్ రిపోర్ట్ ఆప్షన్ కూడా
ఎక్కువ సమయం సమావేశాలు నిర్వహించే వారికి, స్కూళ్లు, కాలేజీలు తమ విద్యార్థుల హాజరు వివరాలను తెలుసుకోవడానికి అంటెడెన్స్ రిపోర్ట ఫీచర్ ఎంతగానే ఉపయోగపడుతుందని గూగుల్ పేర్కొన్నట్టు 9to5 సంస్థ తెలిపింది. సమావేశాలకు ఎవరెవరు, ఎంతసేపు హాజరయ్యారనేది తెలుసుకోవడం నిర్వాహకులకు ఇప్పుడు సులభం కానుంది. తాజాగా విడుదల చేసిన ఈ ఫీచర్లను రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి చేరువ చేసే ప్రయత్నాలో గూగుల్ నిమగ్నమైంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :