Wednesday, September 16, 2020

AP Emcet Guidelines



Read also:

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్‌ పరీక్షలు రేపటి (17వ తేది) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో మొత్తం 14 సెషన్లుగా పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షకు ఈ ఏడాది 2,72,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఆంధ్రప్రదేశ్ , హైదరాబాద్‌తో కలుపుకుని మొత్తం 47 ప్రాంతాల్లో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.

పరీక్షా మార్గదర్శకాలు


  • మొదటి సెషన్‌ ఉదయం గం.9-12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం గం.3-6వరకు ఉంటుంది.
  • గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిని ఇస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదు.
  • ఈ–హాల్‌ టికెట్‌, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని నింపి సమర్పించాలి.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది.
  • హాల్ టికెట్‌తో పాటు మరో అధికారిక ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులను బయటకు పంపరు.
  • పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కచ్చితంగా మాస్క్‌, చేతి గ్లోవ్స్ ధరించాలి.
  • 50 ఎంఎల్‌ శానిటైజర్, పారదర్శకంగా ఉండే వాటర్‌ బాటిళ్లను లోపలకు అనుమతిస్తారు.
  • కరోనా లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షకు అనుమతిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :